ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ‘ఏ సూటబుల్ బాయ్’ వెబ్ సిరీస్ వివాదాస్పదంగా మారింది. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా సదరు వెబ్ సిరీస్‌ను రూపొందించారని మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. మీరా నాయర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో ఓ గుడిలో ముద్దు సీన్ ఉంది. ఇప్పుడు ఇది వివాదానికి దారి తీసింది. మతపరమైన భావోద్వేగాలను అవమానించడంతో పాటు ఇది లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని బీజీపీ యువమోర్చా నాయకులు ఫిర్యాదు చేసింది.
దీంతో మధ్యప్రదేశ్ హోంశాఖా మంత్రి నరోత్తం మిశ్రా ఆదేశాల మేరకు రేవా పోలీసులు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్, డైరెక్టర్ అంబికా ఖురానాపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని వివాదం చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రి తప్పు పట్టారు. గుడిలో ముద్దు సీన్ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. గుడిపైన అంత పెద్దగా ఉన్న బూతు బొమ్మల కంటే ఇది పెద్ద తప్పుగా కనిపిస్తుందా అని ఆమె ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.
మధ్యప్రదేశ్ లో ఖజురహో ఆలయాలు శృంగార ప్రేమను ప్రోత్సహించే విధంగా ఉన్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లో ఉన్న ముద్దు సీన్ తో ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ పాలనతో దుర్మార్గం రాజ్యమేలుతోందని కామెంట్ చేశారు. ప్రతీ చిన్న విషయాన్ని తప్పుబట్టే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?