Bigg Boss 7 Telugu: అమర్ కి ఎందుకు కోపం వచ్చింది ? శోభ చేసి ఆ పని వల్లే ప్రియాంక ఏడ్చిందా ?

బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే ఇద్దరి ఫ్రెండ్స్ మద్యలో చిచ్చు పెట్టింది. ఇప్పటి వరకూ కలిసి ఆడిన సీరియల్ బ్యాచ్ మద్యలో వివాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రియాంక – అమర్ దీప్, ప్రియాంక – శోభాశెట్టి మద్యలో గొడవలు జరిగాయి. నిజానికి టాస్క్ లో ఏం జరిగిందంటే., ప్రియాంక పాయింట్స్ పట్టికలో ఆఖరిలో ఉండటం వల్ల బిగ్ బాస్ తన పాయింట్స్ లో సగం ఎవరికైనా సరే ఇమ్మని అదేశించాడు. దీంతో ప్రియాంక అస్సలు ఆలోచించకుండానే టక్కుమని గౌతమ్ పేరు చెప్పింది.

గౌతమ్ కి పాయింట్స్ ఇస్తున్నానని చెప్పింది. ఎందుకంటే, గతవారం తను కెప్టెన్ అయ్యేందుకు గౌతమ్ సహాయం చేశాడు. అందుకే గ్రాటిట్యూడ్ చూపిస్తూ తన పాయింట్స్ లో సంగం గౌతమ్ కి ఇచ్చింది. నిజానికి అమర్ దీప్ తనకి ఇస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. శివాజీకి కుడా అదే చెప్పాడు. కానీ, ప్రియాంక సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక దీంతో అమర్ బాగా ఫీల్ అయ్యాడు. ప్రియాంక వచ్చి మాట్లాడుతుంటే., నాకు ఇచ్చేసరికే మీకు గ్రాటిట్యూడ్స్ గుర్తుకు వస్తాయంటూ మాట్లాడాడు. అంతేకాదు, నేను వెధవని అయిపోయానని నిరుత్సాహంగా మాట్లాడాడు. దీంతో ప్రియాంక బాగా అప్సెట్ అయ్యింది.

నిజానికి అమర్ దీప్ ఈమాట అనడం వెనుక శోభాశెట్టి ఉంది. ప్రియాంక గౌతమ్ కి పాయింట్స్ ఇవ్వగానే శోభాశెట్టి అమర్ దగ్గరకి వచ్చి చాడీలు చెప్పింది. ప్రియాంక – గౌతమ్ ఇద్దరూ అవుట్ అయి ఉంటే ఆ పాయింట్స్ ని అర్జున్ కి ఇద్దామని అనుకున్నారని, నీకు ఇద్దామని అస్సలు ఊసే రాలేదని చెప్పింది. దీంతో అమర్ కి ఇంకా కోపం వచ్చింది. ఫస్ట్ నుంచీ కూడా ఫ్రెండ్స్ అని అనుకున్నాను, అందుకే నేను అడగలేదు. ఖచ్చితంగా ఇస్తుందనే అనుకున్నానని బాధ పడ్డాడు.

ఆ కోపాన్ని ప్రియాంకపై ప్రదర్శించాడు. ఇక ప్రియాంక బాధపడుతుంటే, శోభా వచ్చి కిచెన్ లో వంట చేద్దామని చెప్పింది. దీంతో ప్రియాంక కాసేపు ఆగి వస్తానని చెప్పినా వినిపించుకోకుండా మాట్లాడుతూనే ఉంది. దీంతో ప్రియాంక మరింత బాధపడింది. శోభాశెట్టి రుసరుస లాడుతూ వెళ్లిపోయి కిచెన్ లో రోటీ చేయడం మొదలుపెట్టింది. అక్కడికి వచ్చిన ప్రియాంక అన్యమనస్సుతోనే రోటీలు చేస్తుంటే వద్దని వారించింది. దీంతో ప్రియాంకకి ఇంకా శోభాకి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది.

నీకు కోపంగా ఉంటే వద్దులే వదిలేయ్ అంటు శోభా ఫ్రస్టేషన్ తో మాట్లాడింది. అసలే నిరుత్సాహంగా ఉన్న ప్రియాంక మాటకి మాట చెప్పింది. నిజానికి ప్రియాంక ఆటలో ఎలాంటి తప్పు చేయలేదు. తనకి కెప్టెన్సీ ఇప్పించిన గౌతమ్ కోసం తన పాయింట్స్ ని ఇచ్చింది. నిజానికి ఈ టాస్క్ లలో ప్రియాంక చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఒకవైపు అర్జున్ – పల్లవి ప్రశాంత్ ఇద్దరూ ఉన్నా కూడా ప్రియాంక టాస్క్ (Bigg Boss 7 Telugu) లో తన బెస్ట్ ని చూపించింది. మొత్తానికి అదీ మేటర్.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus