టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ నటించిన వారసుడు మూవీ తమిళంలో యావరేజ్ గా నిలిస్తే తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారసుడు సినిమాతో తెలుగులో మార్కెట్ పెరుగుతుందని భావించిన విజయ్ కు ఈ సినిమా ఫలితం నిరాశనే మిగిల్చింది. అయితే ఈ సినిమాకు విజయ్ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం.
వెట్రి అనే మూవీతో బాల నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ అంతకంతకూ ఎదుగుతూ కోలీవుడ్ స్టార్ హీరోలలో ఏ హీరో తీసుకోని స్థాయిలో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తే పాలిటిక్స్ లో కూడా సంచలనాలు సృష్టిస్తాడని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే విజయ్ ఆస్తుల విలువ ఏకంగా 445 కోట్ల రూపాయలు అని బోగట్టా. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఆస్తులను కలిగి ఉన్న హీరోలు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు.
యాడ్స్ ద్వారా కూడా విజయ్ కు భారీ స్థాయిలో ఆదాయం దక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ కు ఖరీదైన కార్లు, బంగ్లాలు ఉన్నాయని బోగట్టా. విజయ్ ఆస్తులు ఈ రేంజ్ లో ఉన్నాయా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఇతర హీరోలకు భిన్నంగా కథలను ఎంచుకుంటున్నారు. మాస్ సినిమాలలో నటిస్తూనే ఆ సినిమాలు కొత్తగా ఉండేలా విజయ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
నటన విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా ఆ కామెంట్లను పట్టించుకోకుండా విజయ్ ముందుకు వెళుతున్నారు. విజయ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం లేదు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా విజయ్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?