The GOAT: ‘గోట్’ కోసం మరోసారి విజయ్ రెడీ.. అభిమానులకు ‘డబుల్’ కిక్
- May 29, 2024 / 10:45 AM ISTByFilmy Focus
తను నటించిన సినిమాల్లో విజయ్ (Thalapathy Vijay) పాట పాడటం కొత్తేమీ కాదు. చాలా సినిమాల్లో ఆయన పాట పాడారు. అయితే ఒకే సినిమాలో రెండు పాటలు పాడటం మాత్రం ఇప్పటివరకు జరగలేదు. ఇప్పుడు అతని కొత్త చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) (The Greatest of All Time (The GOAT) సినిమాలో ఈ ఫీట్ చేశాడట విజయ్. సినిమా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చిన యువన్ శంకర్.. విజయ్ ‘గోట్’ సినిమా పాటల అప్‌డేట్ కూడా ఇచ్చారు.
‘విజయ్ ఈ సినిమా కోసం రెండు పాటలు పాడారని, ఆయన ఒకే సినిమాలో రెండు పాటలు పాడడం ఇదే తొలిసారి’ అని యువన్ చెప్పారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. విజయ్ తన సినిమాలో ఇప్పటివరకు 25 పాటలు పాడారు. విజయ్ 1994లో విడుదలైన ‘రసిగన్’ అనే సినిమా కోసం మొదటిసారి పాట పాడారు. 2012లో వచ్చిన ‘తుపాకీ’ సినిమాలోని ‘గూగుల్..’ పాటకు ‘ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనే అవార్డును అందుకున్నారు.

‘ది గోట్’ సినిమాలో విజయ్ పాడిన ‘విజిల్ పోడు..’ పాట ఇప్పటికే వచ్చేసింది. రికార్డులు మీద రికార్డులు బద్దలుకొట్టింది కూడా. ఇప్పుడు కొత్త పాట ఎలా ఉంటుందో చూడాలి. ‘గోట్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో యంగ్ విజయ్ కోసం ‘డీ ఏజినింగ్ టెక్నాలజీ’ వాడారు. ఆ టెక్నాలజీతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపిస్తారట. ఈ మేరకు విజువల్ ఎఫెక్ట్ పనులు పూర్తయ్యాయట. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లోని ఓ స్టూడియోలో ఈ పనులు పూర్తి చేశారట.
‘అవతార్’, ‘అవెంజర్స్’ తదితర హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ పనులు చేశారట. ‘గోట్’ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయికగా నటిస్తోంది. స్నేహ (Sneha), లైలా (Laila) , ప్రశాంత్ (Prashanth), ప్రభుదేవా (Prabhu Deva) తదితరులు ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న ప్రేక్షకుల తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.












