Vijay: క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడతాయి. రీసెంట్ గా విడుదలైన ‘మాస్టర్’ సినిమా తెలుగునాట మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే చాలా కాలంగా విజయ్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. విజయ్ కి కూడా తన మార్కెట్ ను విస్తరించాలనే ఆలోచన ఉంది. దానికి తగ్గట్లే ప్లాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసేది మాత్రం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా విజయ్ మరో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చాలా కాలంగా హీరోల కోసం వెతుకుతున్నాడు. ప్రస్తుతం అందరూ బిజీగా ఉండడంతో వంశీకి హీరోలు దొరకడం లేదు. అయితే రీసెంట్ గా చెన్నై వెళ్లిన వంశీ పైడిపల్లి అక్కడ విజయ్ ని కలిసి స్క్రిప్ట్ నేరేట్ చేసినట్టు తెలుస్తోంది. వంశీ నేరేషన్ తో విజయ్ ఇంప్రెస్ అయ్యారని టాక్. దీంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ప్రస్తుతం విజయ్ తన తదుపరి సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయబోతున్నారు. జూన్ లో ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. దాని తరువాత తెలుగు స్ట్రెయిట్ సినిమా ఉంటుంది. మరి ముందుగా మైత్రి బ్యానర్ లో సినిమా మొదలుపెడతారో లేక దిల్ రాజుకి డేట్స్ ఇస్తారో చూడాలి!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus