Thaman, Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ కోసం అబేయ్‌ స్టూడియోకి వెళ్లాం: తమన్‌

తమన్‌తో తొలిసారి పని చేసిన హీరోల సినిమాలు ఘనవిజయాలు అందుకుంటాయా? ఆయన ట్రాక్‌ రికార్డు చూస్తే ఈ విషయం పక్కాగా అర్థమవుతుంది. దాంతోపాటు ఆయన కూడా అదే మాట అంటున్నారు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ.. ఆయన చిరంజీవితో పని చేసిన తొలి సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ కూడా ఘన విజయం సాధించింది. ఈ మేరకు మార్కెట్‌ వర్గాల నుండి రిపోర్ట్స్‌ పాజటివ్‌గా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

చిరంజీవి సినిమా పాటల రికార్డింగ్‌ను తమన్‌ ఐదేళ్ల వయసున్నప్పుడే చూశారట. ఆ విషయం గురించి చెబుతూ ‘‘చిన్నప్పుడు అమ్మతో కలిసి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు వెళ్లాను. అప్పుడు నాకు ఐదేళ్లు ఉంటాయి అనుకుంటా. అప్పుడు ‘యముడికి మొగుడు’ సినిమాలోని ‘అందం హిందోళం..’ అనే పాట రికార్డు చేస్తున్నారు. అప్పటి నుండి చిరంజీవి సినిమా ఒక్కటీ వదల్లేదు. ఇంట్లో కూడా చిరంజీవి సినిమాల పాటలే వాయిస్తూ ఉండేవాణ్ని’’ అంటూ తన జీవితంలో చిరంజీవి చూపించిన ప్రభావం గురించి చెప్పారు గమన్‌.

చిరంజీవి సినిమాలకి సంగీతం ఇవ్వడం అంత సులభం కాదు. అందులోనూ ‘గాడ్‌ఫాదర్‌’లో పాటలకు, సంగీతానికి పెద్దగా అవకాశం లేదు. అన్నీ కథని నడిపే పాటలే. అలాంటి సినిమాకు సంగీతం ఇవ్వడం చాలా కష్టం. అయితే నేనూ, మోహన్‌రాజా చాలా రోజులు ట్రావెల్‌ చేసి, కష్టపడి పని చేశాం అని చెప్పారు తమన్‌. అంతేకాదు లండన్‌లో ప్రతిష్ఠాత్మక అబే రోడ్‌ స్టూడియోస్‌లో ఈ సినిమాకి నేపథ్య సంగీతం రికార్డు చేశారట.

అక్కడ రికార్డ్‌ చేసిన తొలి భారతీయ సినిమా ఇదేనట. మామూలుగా ఆ స్టూడియోను అందరికీ ఇవ్వరని తమన్‌ చెప్పుకొచ్చాడు. మణిశర్మ, కోటి, కీరవాణి లాంటివాళ్లు చిరంజీవి సినిమాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అలాంటి హీరో సినిమాకు నేను సంగీతం ఇచ్చినప్పుడు కచ్చితంగా పోలిక వస్తుంది. అందుకే సంగీతం అదిరిపోవాలి.. అదిరిపోవాలి అనుకుంటూ.. కష్టపడి పని చేశాను. ఇప్పుడు థియేటర్లలో రెస్పాన్స్‌ చూస్తుంటే.. ఆనందానికి అవధులు లేవు అంటూ తమన్‌ తన ఆనందాన్ని వివరించారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus