క్రేజీ ఆఫర్ కొట్టేసిన తమన్!

  • January 20, 2021 / 04:12 PM IST

‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమా అంటే దానికి తమన్ మ్యూజిక్ ఉండాల్సిందేననే పరిస్థితి వచ్చింది. తమన్ ఒప్పుకోకపోతే అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వైపు చూస్తున్నారు. కానీ తమన్ మాత్రం తన దగ్గరకి వస్తున్న ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. వరుస సినిమాలకు పని చేస్తూ బిజీ అయిపోయాడు. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకున్నాడు తమన్.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కాస్టింగ్ ప్రాసెస్ మొదలైంది. నయనతార, సత్యదేవ్ లాంటి వాళ్లను తీసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని తమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రతీ కంపోజర్ కి ఇదొక పెద్ద కల అని.. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు సమయం వచ్చిందని తమన్ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం తమన్ చేతిలో ఉన్నవన్నీ భారీ బడ్జెట్ సినిమానే. పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమా కూడా అతడి చేతికే వచ్చింది. ఇలాంటి ఛాన్స్ తనకు వచ్చినందుకు తమన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus