Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?
- January 23, 2026 / 06:39 PM ISTByPhani Kumar
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్ పేరు కచ్చితంగా ఉంటుంది. సంగీత దర్శకుడిగా అతని పేరుంటే.. ఆడియో రైట్స్ రూపంలో రూ.10 కోట్ల వరకు ఆడియో రైట్స్ సేల్ అవుతూ ఉంటాయి. సాంగ్స్ సంగతి ఎలా ఉన్నా.. తమన్(Thaman) మ్యూజిక్ కి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తూ ఉంటాడు.
Thaman
అందుకే తమన్ టాలీవుడ్లో ఇప్పుడు బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. స్టార్ హీరోలు చేసే సినిమాలకి ఎక్కువగా పనిచేస్తుంది తమనే. ఏడాదికి 2,3 స్టార్ హీరోల సినిమాలు వస్తుంటే.. అందులో 2 తమన్ సంగీతం అందించిన సినిమాలే ఉండటం గమనార్హం. గతేడాది ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’ ‘ఓజి’ వంటి పెద్ద సినిమాలు వచ్చాయి. వీటన్నిటికీ తమన్ సంగీతం అందించాడు.

అయితే పాన్ ఇండియా సినిమాలకి మాత్రం తమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదు అనే కంప్లైంట్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రీజనల్ సినిమాలకి తమన్ మ్యూజిక్ ఓకే. కానీ పాన్ ఇండియా సినిమాలకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ అవ్వడం లేదు అనేది చాలా మంది చెప్పే మాట. ఉదాహరణకి ‘గేమ్ ఛేంజర్’ సినిమానే తీసుకుందాం. అది శంకర్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా. కానీ దాని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకి సెట్ అవ్వలేదు.
మరోవైపు అదే టైంలో వచ్చిన రీజనల్ సినిమా ‘డాకు మహారాజ్’ కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అటు తర్వాత బాలయ్య ‘అఖండ 2’ అనే పాన్ ఇండియా సినిమాకి తమన్ సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. ఈ సినిమాకి మెయిన్ మైనస్ అదే అయ్యింది. కానీ దానికి ముందు వచ్చిన రీజనల్ మూవీ ‘ఓజి’ కి తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ది రాజాసాబ్’ సినిమా పరిస్థితి కూడా అంతే.ఇది కూడా పాన్ ఇండియా సినిమానే.ఈ సినిమా ఆడియో హిట్ అవ్వలేదు. ఒక్క చార్ట్ బస్టర్ సాంగ్ కూడా లేదు.దీనికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ అవ్వలేదు. సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. సో మొత్తంగా పాన్ ఇండియా సినిమాలకి తమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.














