Thaman: థియేటర్లో కన్నీళ్ళు పెట్టుకున్న తమన్..వైరల్ అవుతున్న వీడియో..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరిసు’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జయసుధ, శ్రీకాంత్, కిక్ శామ్.. వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ మూవీ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ ‘వారసుడు’ పేరుతో జనవరి 14న రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉండగా.. జనవరి 13 నైట్ అక్కడ ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడ రిపోర్ట్స్ ఈ చిత్రానికి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, పంగల్ కు ప్రేక్షకులంతా పక్కా చూడాల్సిన మూవీ అని అక్కడి ప్రేక్షకులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ప్రతి సన్నివేశం కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల బాగా హైలెట్ అయ్యిందట.

అక్కడి లోకల్ థియేటర్లో దర్శకుడు వంశీ, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ .. ‘వరిసు’ చిత్రాన్ని వీక్షించారు. అక్కడ సినిమా చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ తమన్ మ్యూజిక్ గురించి పొగుడుతుంటే.. అతను ఎమోషనల్ అయ్యాడు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి .. ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘ఈ మూవీ సక్సెస్ కు నువ్వు అర్హుడివి’ అంటూ అభిమానులు ఈ వీడియోను పోస్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus