Thaman: గుంటూరు కారం గురించి వస్తున్నటువంటి రూమర్లపై ఘాటుగా స్పందించిన!

  • June 21, 2023 / 08:19 AM IST

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ గత కొద్దిరోజులుగా గుంటూరు కారం సినిమా విషయంలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాకు ఈయన సంగీత దర్శకుడుగా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పకున్నారంటు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఇలా ఈ సినిమా నుంచి తప్పుకున్నారంటూ వార్తలు రావడంతో తమన్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం తమన్ (Thaman) గుంటూరు కారం సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి థమన్ అదిరిపోయే బీజీఎం, మ్యూజిక్ కంపోజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక మిగతా పనులను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుతో ఈయనకు మనస్పర్ధలు ఏర్పడ్డాయని అందుకే ఈ సినిమా షూటింగ్ నుంచి తమన్ తప్పుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు రావడంతో తమన్ సోషల్ మీడియా వేదికగా కాస్త ఘాటుగా స్పందిస్తూ అసలు విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రేపటి నుంచి మా స్టూడియోలో బట్టర్ మిల్క్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ మజ్జిగను ఉచితంగానే తాను పంపిణీ చేస్తున్నానని తెలిపారు.

ఎవరికైనా కడుపు మంటగా ఉంటే ఇక్కడికి వచ్చి ఉచితంగా మజ్జిగ తాగండి. నాకు చాలా పని ఉంది సమయం వృధా చేసుకోలేను మీరు కూడా మీ సమయాన్ని వృధా చేయకండి అంటూ కాస్త గుంటూరు కారం లాగే తమన్ కూడా ఘాటుగా తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈయన గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టత ఏర్పడింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus