Thaman: ‘అఖండ’లో తమన్‌ సంగీతంపై అందుకే ప్రశంసలు!

సినిమా విజయంలో సంగీతానికి చాలా కీలక పాత్ర అంటారు. ఏంటీ పాత మాటే చెబుతున్నారు అంటారా? ఇటీవల కాలంలో సంగీతం ప్రధానంగా హిట్‌ కొడుతున్న సినిమాలు తక్కువవుతున్నాయి కాబట్టి. సినిమాను రీరికార్డింగ్‌ మరో లెవల్‌కి తీసుకెళ్లింది అనే మాట ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా విన్నారా? తక్కువే అని చెప్పాలి. ‘అఖండ’తో అలాంటి విజయాన్ని, ఫీల్‌ను ఇప్పుడు చూస్తున్నాం. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా విజయంలో సంగీతానిది ముఖ్యంగా నేపథ్య సంగీతానిది కీలక పాత్ర అని పరిశీలకులు చెబుతున్నారు.

‘అఖండ’ సంగీతం పనులు మొదలైనప్పటి నుండి తమన్‌ చెబుతున్నమాట. ఈ సినిమాలో పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ మామూలుగా ఉండవు అని. ఏముంది ఎవరైనా తమ సినిమా గురించి ఇలానే చెబుతారు అనుకున్నారంతా. కానీ తమన్‌ మాటల వెనుక చాలా మేటర్‌ ఉందని సినిమా చూస్తే తెలిసింది. ‘అఖండ’లో సీనియర్‌ బాలయ్య అఘోరా పాత్ర ఎంటర్‌ అయ్యాక… ప్రేక్షకులకు కొత్త తమన్‌ వినిపిస్తాడు. సినిమాకు, ఆ సీన్లకు, బాలయ్య ఆహార్యానికి తగ్గట్టుగా గంభీరమైన సంగీతాన్ని ఇచ్చాడు. ఆ సీన్లు అంతగా కనెక్ట్‌ అయ్యాయి అంటే సంగీతమూ ఒక కారణం.

తమన్‌ సంగీతం అంటే డప్పుల మోత మాత్రమే అనే అపవాదు చాలా రోజులు ఉంది. దీని నుండి బయట పడటానికి తమన్‌ చాలానే కష్టపడ్డాడు. కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకొని… తన ఆలోచనలో, సంగీతంలో మార్పులు చేసుకొచ్చాడు. అతను రీఎంట్రీ ఇచ్చిన సినిమా ‘అరవిందసమేత..’. అందులో తమన్‌ సంగీతం పీక్స్‌లో ఉంటుంది. పాటలు, నేపథ్య సంగీతం అదిరిపోయాయి. ఆ తర్వాత తమన్‌ ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. ప్రతి సినిమాకు క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇస్తూ వచ్చాడు.

‘అరవింద సమేత’ నేపథ్య సంగీతాన్ని మించి ‘అఖండ’కు ఇచ్చాడు తమన్‌. సినిమా చూసిన ఎవరైనా సరే ఇదే మాట అంటారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, బాలయ్య ఎలివేషన్లు, విలన్‌ ఎంట్రీలు… ఇలా అన్ని చోట్లా తమన్‌ తన జోరు చూపించాడు. అందుకే ఆ సీన్లు చూస్తుంటే… అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు. తెరపై బాలయ్య శివతాండవం చేస్తుంటే… తెర వెనుక తమన్ సంగీత తాండవం చేశాడు. ఇలా తమన్‌ ఈ సినిమాకు అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. సింపుల్‌గా చెప్పాలంటే థ్యాంక్యూ తమన్‌… అండ్‌ ఆల్‌ ది బెస్ట్‌!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus