Thaman: తమన్ నాన్ స్టాప్ గేమ్.. ఆ సినిమాలకు ఎంత కష్టపడుతున్నాడంటే..

టాలీవు స్టార్డ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ (S.S.Thaman) ప్రస్తుతం తన కెరీర్‌ ను స్పీడ్ ట్రాక్ లో కొనసాగిస్తున్నాడు. వరుస బ్లాక్‌బస్టర్‌ ప్రాజెక్టులతో తమన్ పేరు ఇండస్ట్రీలో మరింత గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ (Trivikram), బోయపాటి (Boyapati Srinu), రాజమౌళి (S. S. Rajamouli) లాంటి స్టార్‌ దర్శకుల చిత్రాలకు సంగీతం అందిస్తూ మ్యూజిక్‌ ప్రియులను అలరిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న రెండు భారీ చిత్రాలకు తమన్‌ మ్యూజిక్‌ అందిస్తుండటంతో ఆయన బిజీబిజీగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్‌ చరణ్‌  (Ram Charan)  ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాకు తమన్‌ అందిస్తున్న సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది.

Thaman

మరోవైపు బాలకృష్ణ‌ (Nandamuri Balakrishna) నటిస్తున్న‌ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) కోసం కూడా తమన్‌ అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ రెండు సినిమాలు రెండు రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. ఒకటి జనవరి 10న, మరొకటి 12న విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల రాజమండ్రిలో జరిగిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తమన్‌ మాట్లాడుతూ తన పరిస్థితిని పరోక్షంగా తెలియజేశారు. 15 రోజులుగా నిద్రలేకుండా పని చేస్తున్నానని చెప్పిన ఆయన, వేదికపై తడబాటు ప్రదర్శించడంతో ఆ టెన్షన్‌ స్పష్టంగా కనిపించింది.

తాజాగా సోషల్‌ మీడియాలో తమన్‌ హార్డ్‌వర్క్‌పై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని టాక్. గ్యాప్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని పనులు ఫినిష్ అయినప్పటికీ ప్యాచప్ వర్క్స్ లో బిజీ అవుతున్నట్లు టాక్. ఎక్కువగా గేమ్ ఛేంజర్ కు సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పూర్తి చేయడంలో తమన్‌ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అన్ని ఇన్ని కావు.

ఇప్పటివరకు ‘గేమ్‌ ఛేంజర్‌’ పాటలకు కాస్త మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది, ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమా విజయంలో మరింత కీలక పాత్ర పోషిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు కావడంతో ఫ్యాన్స్‌ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తమన్‌ ఈ సినిమాలకు ఎలాంటి మ్యూజిక్‌ ఇస్తాడోననే ఉత్కంఠగా ఉంది. తమన్‌ ఎప్పటికీ తన బెస్ట్‌ అవుట్‌పుట్‌ అందిస్తాడన్న నమ్మకం ఉందని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. మరి ఈ సంక్రాంతి రేస్‌లో తమన్‌ తన సంగీతంతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus