Thaman: మరోసారి కాపీ ట్యూన్‌తో బోర్‌ కొట్టించిన తమన్‌!

  • August 22, 2022 / 11:40 AM IST

తమన్‌ సంగీతం సూపర్‌గా ఉంటుంది. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడే చిన్న సమస్య వచ్చిపడింది. ఆయన సంగీతంలో కొత్తదనం కావాలంటే.. ఆ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ అవ్వాలా? ఇలా ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా? ఆదివారం విడుదలైన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా టీజర్‌ చూశాక నెటిజన్లు కూడా ఇదే మాట అంటున్నారు. దానికి కారణంగా ఆ మ్యూజిక్‌ ఎక్కడో వినినట్లుగా ఉంది అనుకుంటూ సెర్చింగ్‌ మొదలెట్టి.. ఆఖరికి ‘గని’ దగ్గర ఆగిపోయారు.

తమన్‌ సంగీతంలో కాపీ అనే మాట కచ్చితంగా వస్తుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఇదే మాట ఎక్కడో దగ్గర వినిపిస్తుంది. దీంతో కాపీ ట్రోలింగ్‌ తమన్‌కి కూడా అలవాటు అయిపోయింది. మరీ అడిగితే.. నా మ్యూజిక్‌ నేనే మళ్లీ కొట్టాను, వేరే వాళ్లది కాదు కదా అని కూడా అంటాడు. అయితే కొట్టిన మ్యూజిక్‌ మళ్లీ కొట్టడం ఎందుకు అనే మాటకు ఆన్సర్‌ ఉండదు. ఒక్కోసారి అది గతంలో వాడాను అనే మాట కూడా గుర్తుండదేమో అనిపిస్తుంటుంది.

‘గాడ్‌ఫాదర్‌’ టీజర్‌ చూసి మెగా ఫ్యాన్స్‌ ‘వావ్‌’ అనుకుంటుంటే.. ‘గని’ సినిమా బ్యాగ్రౌండ్‌లా ఇది కూడా అనిపించడంతో ‘ఓ తమన్‌.. వాటీజ్ దిస్‌’ అనుకుంటున్నారు. వరుణ్‌ తేజ్‌ ‘గని’ సినిమా కోసం వాడిన థీమ్‌ మ్యూజిక్‌, ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా టీజర్‌ బ్యాగ్రౌండ్‌ ఒకేలా ఉన్నాయి అంటూ మ్యూజిక్‌ బిట్లు కలిపేసి మరీ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. మరి దీనిపై తమన్‌ ఎప్పటిలాగే లైట్‌ తీసుకుంటాడో, లేదంటే ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.

అయితే, తమన్‌ బీజీఎం సూపర్‌ ఉంటుంది. దాంతో సినిమా ఫీల్‌ కూడా మారిపోతుంది అనే విషయం మనకు బాగా తెలుసు. కాబట్టి..ఇ దంతా వదిలేసి అక్టోబరు ఐదు కోసం వెయిట్‌ చేయడమే. ఎందుకంటే ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా రిలీజ్‌ అయ్యేది అప్పుడే. దసరా కానుకగా అక్టోబరు 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం టీజర్‌లో చెప్పింది. అన్నట్లుగా ఆ రోజే నాగార్జున ‘ఘోస్ట్‌’ కూడా వస్తోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus