Thaman: ఈసారి పక్కా అంటున్నారు.. తమన్ ప్లేస్ లో ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?

టాలీవుడ్ బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. పెద్ద సినిమాలు అన్నీ తమన్ అకౌంట్లోనే ఉన్నాయి. ఇన్ని పెద్ద సినిమాలను తమన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ను ఎలా ఇవ్వగలుగుతున్నాడు? అనేది తర్వాతి సంగతి. నెటిజన్లు ఎంత ట్రోల్ చేసినా తమన్ వాటిని పట్టించుకోడు. అయితే తమన్ చేస్తున్న పెద్ద సినిమాల్లో మహేష్ – త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ సినిమా ఒకటి.

ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యింది. డానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి విశేషదారణ దక్కింది. ఇదిలా ఉండగా.. ‘గుంటూరు కారం’ చిత్రం నుండీ తమన్ తప్పుకున్నట్టు ప్రచారం గట్టిగా జరుగుతుంది. అందుకు గల కారణాలు ఏంటి అన్నది తెలీదు కానీ.. తమన్ స్థానంలో జి.వి.ప్రకాష్ కుమార్ వచ్చి చేరాడని అంటున్నారు. నిజానికి గ్లిమ్ప్స్ రిలీజ్ కాకుండానే తమన్ ను ఈ చిత్రం నుండీ తీసేసినట్టు కథనాలు వినిపించాయి.

కానీ గ్లిమ్ప్స్ కి తమన్ సంగీతం అందించడంతో అవి గాసిప్స్ అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు నిజంగానే తమన్ ను తీసేసినట్టు ఎక్కువగా వార్తలు వినిపించడంతో మళ్ళీ ఈ టాపిక్ వైరల్ గా మారింది. అయితే తమన్ ఈ చిత్రానికి గాను 40 శాతం వర్క్ కంప్లీట్ చేశాడు. మరి జి.వి.ప్రకాష్ తో మళ్ళీ మొదటి నుండీ మ్యూజిక్ చేయించుకుంటారా? లేక తమన్ కి కూడా క్రెడిట్స్ ఇస్తారా? అసలు తమన్ నిజంగానే తప్పుకున్నాడా? అనే విషయాల పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus