Thaman, OG: తమన్‌ అంచనాలు పెంచుతూనే ఉన్నారు.. ‘ఓజీ’ అవుట్‌పుట్‌ అలా ఉంటుందా?

సినిమా గురించి హైప్‌ పెంచాలి అంటే ఒకప్పుడు టీజర్‌, ట్రైలర్‌, పోస్టర్‌, పాట రిలీజ్‌ చేసేవారు. వాటిని చూసి… సినిమా ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అంటూ… అభిమానులు లెక్కలేసుకునేవారు. అయితే ఇప్పుడు ఈ సోషల్‌ మీడియా యుగంలో అంతా మారిపోయింది. సినిమా గురించి పోస్టర్‌ బదులు ట్వీట్‌ చేస్తున్నారు. టీజర్‌/ ట్రైలర్‌ బదులు చిన్న వీడియో బిట్‌ రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా టీమే కాదు… అందులో పని చేసే సాంకేతిక నిపుణులు, నటులు కూడా ఇలాంటి పనుల్లో భాగస్వాములు అవుతున్నారు.

ఓ సినిమా గురించి హైప్‌ ఇవ్వడానికి ట్వీటు, కామెంట్‌ సరిపోతుంది అంటే నమ్మరా? అయితే తమన్‌ (S.S.Thaman) లేటెస్ట్‌గా ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు. అది చూస్తే… హైప్‌ పెంచడం ఎలా అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓ పవన్ (Pawan Kalyan) అభిమాని సినిమా టీజర్‌లోని మ్యూజిక్‌తో ‘ఓజీ’ సినిమా (OG Movie) రిలేటెడ్‌ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోకు తమన్ రియాక్ట్ అయ్యారు. పవన్ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల బిల్డింగ్ బ్లాస్ట్ అయ్యేలా ఆ వీడియోను ఎడిట్ చేశారు. ‘ఇది కేవలం బిగినింగ్ మాత్రమే…’ అంటూ రిప్లై ఇచ్చారు తమన్‌.

అయితే దానికి కంటిన్యూస్‌గా ‘సినిమా మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉండబోతుంది’ అంటూ వాక్యాన్ని పూర్తి చేస్తున్నారు ఫ్యాన్స్‌. నిజానికి ఈ సినిమా మ్యూజిక్‌ చాలా డిఫరెంట్‌గా, బ్లాక్‌బస్ట్‌ర్‌లా ఉండబోతోంది అని ఎప్పుడో తమన్‌ చెప్పేశారు. ఈ సినిమా కోసం ఓ స్పెషల్‌ టీమే వర్క్‌ చేస్తోంది అని కూడా తెలిపారు. అంటే రెగ్యులర్‌ టీమ్‌ కాకుండా కొత్త వాళ్లతో, ప్రత్యేకమైన వాళ్లతో ‘ఓజీ’ వర్క్‌ చేయిస్తున్నారు. మరి ఆ స్పెషలేంటో సినిమా రిలీజ్‌ టైమ్‌కి తెలుస్తుంది.

సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) హీరోయిన్‌. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తగా రిలీజ్‌ చేస్తామని టీమ్‌ చెప్పింది. అయితే సినిమా ఎంతవరకు పూర్తయింది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అయితే పవన్‌ కల్యాణ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయనే సంగతి తెలిసిందే.

https://twitter.com/MusicThaman/status/1780941435837223180

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus