Thaman: వీరసింహారెడ్డిపై థమన్ కాన్ఫిడెన్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వారసుడు, వీరసింహారెడ్డి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. రీ రికార్డింగ్ పనులతో బిజీగా ఉండటంతో ఈ రెండు సినిమాల ఈవెంట్లకు సైతం థమన్ హాజరు కాలేదు. అయితే తాజాగా థమన్ మాట్లాడుతూ వీరసింహారెడ్డి సినిమాకు కూడా స్పీకర్లు పగులుతాయంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు. మరికొన్ని గంటల్లో వీరసింహారెడ్డి మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

అయితే వీరసింహారెడ్డి సినిమాకు ఇప్పటివరకు కొన్ని ఏరియాలలో బుకింగ్స్ మొదలుకాలేదు. వారసుడు సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ మొదలు కాగా వీరసింహారెడ్డి బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా కోసం చాలా కష్టపడి పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా వేరే స్థాయిలో ఉంటుందని థమన్ తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా అంచనాలను మించి ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని సిస్టర్ సెంటిమెంట్ బాగుంటుందని థమన్ పేర్కొన్నారు. బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సంక్రాంతి సినిమాలన్నీ బాగా ఆడాలని కోరుకుంటున్నానని థమన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. వీరసింహారెడ్డి సెకండాఫ్ లో నాలుగు పాటలు ఉంటాయని బాలయ్య కటౌట్ ఎక్కువ మ్యూజిక్ ను అడుగుతుందని థమన్ చెప్పుకొచ్చారు. థమన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి సినిమాలు థమన్ కోరుకున్న విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి. ఈ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటే థమన్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థమన్ ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus