Thaman: వాళ్ల నోర్లు మూయించిన థమన్.. ఇకనైనా ఆపాలంటూ?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన థమన్ గురించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు అన్నీఇన్నీ కావు. థమన్ ఏ తప్పు చేయకపోయినా ఆయన గురించి ట్రోల్స్ తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తనపై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వచ్చినా థమన్ మాత్రం ఎప్పుడూ వాటి గురించి ఎక్కువగా రియాక్ట్ కావడానికి ఇష్టపడలేదు. అయితే గుంటూరు కారం సినిమా నుంచి థమన్ ను తప్పించారంటూ థమన్ కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేసేలా కొన్ని రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ కామెంట్లు తనను ఎంతగానో బాధ పెట్టడంతో థమన్ రూమర్ల గురించి ప్రస్తావించకుండానే ఘాటు రియాక్షన్ ఇచ్చారు. నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్ మొదలుపెడతానని ఎవరైతే కడుపు మంట సమస్యలతో బాధ పడుతూ ఉంటారో వాళ్లందరూ ఆ మజ్జిగ స్టాల్ దగ్గరకు వచ్చి మజ్జిగ తాగాలని థమన్ చెప్పుకొచ్చారు. మజ్జిగ తాగితే అయినా ఆ సమస్యల నుంచి కోలుకుంటారని భావిస్తున్నానని థమన్ అన్నారు.

దయచేసి నా టైమ్ ను వృథా చేయవద్దని నాకు చాలా పనులు ఉన్నాయని గుడ్ నైట్ అని థమన్ కామెంట్లు చేశారు. కొత్తిమీర చల్లిన మజ్జిగ గ్లాస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ థమన్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. థమన్ షాకింగ్ ట్వీట్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. థమన్  (Thaman) రెమ్యునరేషన్ ప్రస్తుతం 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

సాధారణంగా విమర్శలను పెద్దగా పట్టించుకోని, వాటి గురించి పెద్దగా రియాక్ట్ కాని థమన్ ఈసారి విమర్శలు మరీ హద్దులు దాటడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. థమన్ చేసిన ట్వీట్ కు 8800కు పైగా లైక్స్ వచ్చాయి. తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం థమన్ విజయాలు అందుకోవాలని విమర్శలను, నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా కెరీర్ పరంగా ఎదగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus