Thaman: ప్రభాస్- మారుతి..ల సినిమాకి తమన్ న్యాయం చేస్తున్నాడట..!

ఈ మధ్య కాలంలో సంగీత దర్శకుడు తమన్ గురించి ఎక్కువ కంప్లైంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రతి పెద్ద సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్.. లతో పాటు ప్రభాస్- మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇన్ని పెద్ద సినిమాలకు పనిచేయడం వల్ల..

తమన్ ఏ సినిమాకి కూడా సరైన ట్యూన్స్ ఇవ్వడం లేదు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ‘గుంటూరు కారం’ సాంగ్స్ విషయంలో మహేష్ బాబు ఏమాత్రం సంతృప్తితో లేడు అనే టాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. దీంతో త్రివిక్రమ్ ప్రత్యేకంగా తమన్ వద్ద మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి అనేక రిఫరెన్స్ లు ఇచ్చి 3 ట్యూన్స్ ఓకే చేయించుకున్నాడు. అయితే ప్రభాస్- మారుతి..ల ప్రాజెక్టుకి మాత్రం తమన్ న్యాయం చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.

అవును ప్రస్తుతం చెన్నైలో ఉన్న (Thaman) తమన్ వద్దకి మారుతి వెళ్లి.. మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి అప్పుడే 3 ట్యూన్స్ రాబట్టుకున్నట్టు తెలుస్తుంది. మారుతి మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది. పైగా మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి సినిమాలకి తమన్ నుండి మంచి పాటలు రాబట్టుకున్నాడు మారుతి. ఆ ర్యాపో వల్లే ఇంత ఫాస్ట్ గా ట్యూన్స్ రాబట్టుకోగలిగాడు మారుతి. ఇక ‘పీపుల్ మీడియా’ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 లో విడుదల కానుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus