మురుగదాస్ దృష్టి తమన్ పై పడిందా..?

  • May 6, 2020 / 05:40 PM IST

ఏ.ఆర్.మురుగ దాస్ కేవలం తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా స్టార్ డైరెక్టర్ అనే చెప్పాలి. తెలుగులో డబ్ అయిన అతని సినిమాలు సూపర్ హిట్ లు అయినవి ఉన్నాయి. ‘గజిని’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మురుగ దాస్…తెలుగులో కూడా మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘సెవెంత్ సెన్స్’ ‘ సర్కార్’ వంటి చిత్రాలు తమిళంలో సరిగ్గా ఆడకపోయినా ఇక్కడ మాత్రం హిట్ అయ్యాయి. అయితే మన తెలుగు స్టార్ లు చిరంజీవి, మహేష్ బాబు వంటి వారికి మాత్రం ప్లాప్స్ ఇచ్చాడు.

దాంతో తెలుగు హీరోలతో మురుగ దాస్ కేవలం ప్రయోగాత్మక సినిమాలే చేస్తాడు అనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.ఇది పక్కన పెడితే మురుగదాస్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు అనే కామెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నాయి. ‘సర్కార్’ తెలుగులో హిట్ అయినా.. టేకింగ్ విషయంలో మాత్రం మురుగ దాస్ పై విమర్శలు కురిశాయి. ఇక ‘దర్బార్’ విషయంలోనూ అదే జరిగింది. మురుగదాస్ నుండీ ‘తుపాకీ’ వంటి ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే కలిగిన సినిమా కావాలి అని చాలా మంది కోరుకుంటున్నారు.

ఆ దిశగా ఇప్పుడు విజయ్ తో ‘తుపాకి’ సీక్వెల్ ప్లాన్ చేసాడు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను తీసుకోవాలి అని మురుగదాస్ భావిస్తున్నాడట. ‘తుపాకి’ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతం అందించాడు. అయితే ఈసారి మాత్రం ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ను తీసుకోవాలి అని భావిస్తున్నాడట. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి తమన్ ఇచ్చిన మ్యూజిక్ ప్రపంచం అంతా పాపులర్ అయ్యాయి. ఇక తమన్… తమిళ సినిమాలకు సంగీత దర్శకుడుగా పని చేసాడు కానీ… స్టార్ డైరెక్టర్ తో పని చెయ్యడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus