సంగీత దర్శకుడు థమన్ గతకొన్ని రోజులుగా ఎలాంటి సినిమా చేసినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఇప్పుడు అతను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ గా మారుతున్నాడు. ఇక రీసెంట్ గా రాధే శ్యామ్ సినిమాతో మరోసారి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగానే క్లిక్ అయ్యింది. సినిమాకు రివ్యూలు టాక్స్ ఎలా ఉన్నా కూడా థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఓ వర్గం అభిమానులు బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇక ప్రభాస్ అయితే ఏకంగా థమన్ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తరువాత మరొకలా సినిమా మారిపోయింది అని చెప్పడంతోనే అతని రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం థమన్ లిస్టులో పెద్ద సినిమాలే ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , చిరంజీవి, రామ్ చరణ్ ఇలా వరుసగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పూర్తి స్థాయిలో ఒక సినిమాకు వర్క్ చేయాలని అనుకుంటున్నాడు.
సాహో సినిమా టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన థమన్ ఆ తరువాత మళ్ళీ రాధే శ్యామ్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందుకుని ప్రభాస్ ను సంతృప్తి పరిచాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ అతనికి పూర్తి స్థాయిలో ఒక సినిమా ఆఫర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే రాజా డీలక్స్ అనే సినిమాకు థమన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలు కానుంది.
ఇక వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ అయితే బెస్ట్ అని మారుతి కూడా ముందుగానే చెప్పాడట. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ తో ఇంకాస్త ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఈసారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే కాకుండా పాటలు కంపోజ్ చేయమని ఆఫర్ చేశాడట. మరి థమన్ ఆ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!