Thaman: గేమ్ ఛేంజర్.. తమన్ స్పీడ్ ఎలా ఉందంటే..!

రామ్ చరణ్ (Ram Charan)  -శంకర్  (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ (Game Changer) పై మళ్ళీ హైప్ పెరుగుతోంది. సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఫ్యాన్స్‌లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అద్భుతమైన విజువల్స్, క్యారెక్టర్ ప్రెజెంటేషన్ టీజర్‌లోనే కనిపించడంతో ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇదే క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S.S.Thaman)  ప్రస్తుతం ప్రొమోషన్స్ హడావిడిలో బిజీగా ఉన్నాడు.

Thaman

ఒకవిధంగా చెప్పాలి అంటే తమన్ తపోతే సినిమా యూనిట్ లో ఎవరు ఆ రేంజ్ లో సౌండ్ చేయడం లేదు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో రాబోయే మెలోడీ సాంగ్‌పై అందరి దృష్టి నిలిచింది. తమన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో కాంటాక్ట్‌లో ఉంటూ “రాబోయే అప్డేట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి” అంటూ మరింత ఆసక్తిని రేకెత్తించాడు. అలాగే, ఈ నెల 22న పోస్టర్, 25న ప్రోమో, 27న కొత్త సాంగ్ విడుదలకానున్నాయని ప్రకటించాడు.

ఈ సారి వచ్చే మెలోడీ సాంగ్ ఎంతో మెలోడీగా, డిఫరెంట్ స్టైల్లో ఉండబోతుందట. శంకర్ ఆవిష్కరించిన విజువల్స్ సాంగ్‌కు మరో లెవెల్ హై ఇచ్చేలా ఉంటాయట. తమన్ మాట్లాడుతూ, ఈ పాట ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, శంకర్ విజన్‌తో ఈ సాంగ్ మరింత ప్రత్యేకంగా మారుతుందని చెప్పాడు. ఇటు మేకింగ్ పరంగా, అటు సంగీత పరంగా కూడా ఈ పాట భారీ విజయం సాధించగలదని తమన్ నమ్మకంగా తెలిపారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. మరోవైపు సంక్రాంతి బరిలోనే దిల్ రాజు (Dil Raju) వెంకటేష్ (Venkatesh)  సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ను(Sankranthiki Vasthunnam)  కూడా విడుదల చేస్తుండటంతో టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్ మరింత రసవత్తరంగా మారనుంది.

కుబేరతో రిస్క్ తప్పట్లేదు.. ఏమవుతుందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus