కాపీ ఆరోపణలపై గట్టి కౌంటర్ ఇచ్చిన తమన్!

  • January 19, 2021 / 10:08 PM IST

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో అతడి రేంజ్ మారిపోయింది. దాదాపు స్టార్ హీరోల సినిమాలన్నింటికీ కూడా తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ చాలా బిజీ అయిపోయాడు. ఇదిలా ఉండగా.. అతడిపై ఎక్కువగా కాపీ ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఇంగ్లీష్, స్పానిష్ భాషల మ్యూజిక్ ఆల్బమ్స్ నుండి తమన్ ట్యూన్స్ కాపీ చేస్తుంటాడని సోషల్ మీడియాలో చాలా సార్లు అతడిపై ట్రోలింగ్ జరిగింది. వీటికి ఆధారాలు చూపిస్తూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు కూడా ఉంటాయి.

అలానే తన పాటలను తనే రిపీట్ చేస్తుంటాడనే విమర్శలు కూడా వచ్చాయి. తమన్ ఎన్ని హిట్లు అందుకున్నా.. ఈ కాపీ ఆరోపణలు మాత్రం వస్తూనే ఉన్నాయి. గతంలో కొన్ని సార్లు ఈ ఇష్యూపై స్పందించిన తమన్ తాజాగా మరోసారి తన వెర్షన్ వినిపించాడు. కాపీ విమర్శలను పట్టించుకోనని చెప్పిన తమన్.. ఇండస్ట్రీలో తను పెద్ద హీరోలతో, దర్శకులతో, నిర్మాతలతో, రచయితలతో కలిసి పని చేశానని.. కాపీ ట్యూన్లు అయితే వారు గుర్తు పట్టి ప్రశ్నించరా..? అని అడిగాడు తమన్.

పనిలేని వాళ్లు.. సంగీతం మీద పరిజ్ఞానం లేని వాళ్లే సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉంటారని తమన్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తను వందకు పైగా సినిమాలకు పని చేశానని.. అయితే ఏ కంపెనీ కూడా తనపై ఒక్క కేసు కూడా పెట్టలేందంటే అర్ధం ఏంటని ప్రశ్నించాడు. తనపై వచ్చే విమర్శలు, ఆరోపణలు అర్ధం లేనివని.. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus