గతేడాది విడుదలైన వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కానుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా తమ్మారెడ్డి భరద్వాజకు జగన్ పాలన బాగుంటే మాత్రమే సినిమాల్లోకి వస్తానని పవన్ చెప్పారని పవన్ సినిమాల్లోకి ఆదాయం కోసం వచ్చారా? లేక జగన్ పాలన బాగుండటం వల్ల వచ్చారా? అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు తమ్మారెడ్డి స్పందిస్తూ పవన్ ఒకవేళ సినిమాలు మానేసి ఉంటే ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను తాను చూడలేదని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అందువల్ల జగన్ పాలన బాగున్నట్టే అనుకోవాలని తమ్మారెడ్డి వెల్లడించారు. పవన్ ఎన్ని సినిమాలు చేస్తే పొలిటికల్ పార్టీ నడుస్తుందని 300 కోట్ల రూపాయలతో పార్టీ నడుస్తుందా? అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. తన ఉద్దేశంలో పార్టీని నడపటానికి సినిమాలు చేస్తానంటే కరెక్ట్ కాదని తమ్మారెడ్డి వెల్లడించారు. పవన్ డబ్బు మనిషి కాదని సంపాదించిన డబ్బును పార్టీకే వాడతారని కానీ ఆ డబ్బు సరిపోదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
ఒక పద్ధతిగా వెళితే పవన్ కు డబ్బు అవసరం లేదని పవన్ ను నిజంగా నడిపించుకోగలిగితే ఆయన రాష్ట్రానికి ఏదైనా చేయగలడని తమ్మారెడ్డి అన్నారు. పవన్ మాట మీద ఉంటే ఏదైనా చేయగలడని కానీ ఆయన ఉండటం లేదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. పవన్ నిలకడ లేని మనిషిలా అయిపోయారని అలా ఉండకుండా ఉంటే ప్రజలే పవన్ ను కాపాడతారని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.