మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. తన సినిమాలతో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు చిరంజీవి గట్టి పోటీని ఇస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నంబర్ వన్ హీరోగా చాలా సంవత్సరాల పాటు చిరంజీవి కెరీర్ ను కొనసాగించారు. అప్పటి హీరోలలో ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకొని చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో కూడా సత్తా చాటారు. అందరి మంచి కోరుకునే వ్యక్తిగా మంచి పేరును సంపాదించుకుని సినిమాసినిమాకు క్రేజ్ తో పాటు అభిమానులను చిరంజీవి సంపాదించుకున్నారు.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా ఈ స్టార్ హీరో సత్తా చాటారు. అయితే ప్రస్తుతం చిరంజీవి సినీ ప్రముఖుల నుంచే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. చిరంజీవి చేతులు జోడించి జగన్ ను వేడుకున్నట్లు ఒక వీడియో లీకైంది. ఆ వీడియో గురించి తమ్మారెడ్డి స్పందిస్తూ టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి తొలి అడుగు వేశారని అన్నారు. చిరంజీవి ఇండస్ట్రీ బిడ్డ అని చెప్పినా మేము ఆయనను ఇండస్ట్రీ పెద్దగా భావిస్తామని తమ్మారెడ్డి తెలిపారు.
అయితే మనకంటూ ఆత్మగౌరవం ఉంటుందని లీకైన వీడియో వల్ల చిరంజీవి అడుక్కుంటున్నట్టు తనకు అనిపించిందని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. మనం అడుక్కుతినే స్థితిలో ఉన్నామా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. చిరంజీవి పరువు తీశావయ్యా అంటూ తమ్మారెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోను రిలీజ్ చేశారు. టికెట్ రేట్లతో పాటు సినిమా రంగానికి చాలా సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ఆర్ఆర్ఆర్ కు 15 కోట్ల రూపాయలు అదనంగా రావచ్చని ఆ సినిమా స్థాయికి ఆ మొత్తం నథింగ్ అని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.
తమ్మారెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ లాంటి పెద్ద హీరోలు వెళ్లి యాచించాలా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. స్టార్ హీరోలు అడుక్కునే స్థితిలో ఉండటం బాధ కలిగిస్తోందని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.