క్యూట్ ఫిలిమ్స్ తో సందేశాన్ని, ఫన్ ని అందించే మహాతల్లి ఈ సారి బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమానురాగాలను తెర పైన చూపించే ప్రయత్నం చేసింది. రాఖీ పండుగను పురస్కరించుకుని “తమ్ముడు” అనే షార్ట్ ఫిలిం తో తముళ్లపై అక్క అభిమానం ఎలా ఉంటుందో చెప్పింది. ఇంట్లో సరిగ్గా నిద్ర పోనివ్వడు, అమ్మకి లేనిపోనివి చెప్పి తిట్లు తినిపిస్తాడు, బిజీగా ఉన్నప్పుడు డిస్ట్రబ్ చేస్తుంటాడు.. ఆ సమయంలో కొట్టేయాలని పిస్తుంది. కానీ అక్క కదా .. తమ్ముడి పై చెయ్యి ఎత్తడానికి మనసు రాదు.
అంతే కాదు అతని గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారు అయిపోయినట్లే. తన తమ్ముడు కంటే మంచి వాడు ప్రపంచంలోనే ఎవరూ లేరని వెనకేసుకొస్తుంది. అందుకే అక్క ఉన్న తమ్ముడు.. అన్నా ఉన్న చెల్లెలు ఎప్పటికీ అదృష్టవంతులే. మన తోబుట్టువుల అల్లరిని గుర్తు చేసే ఈ “తమ్ముడు” బుజ్జి మూవీని రాఖీ పండుగ సందర్బంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే.