Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

నితిన్ (Nithiin) హీరోగా రూపొందిన ‘తమ్ముడు’ (Thammudu) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చిన దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ‘ఎం.సి.ఎ’ ‘వకీల్ సాబ్’ వంటి హిట్లు కలిగిన వేణు శ్రీరామ్ దర్శకుడు. కాంబినేషనల్ క్రేజ్ కారణంగానే ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ట్రైలర్ అయితే కచ్చితంగా ఈ సినిమా హిట్ అనే ఫీలింగ్ కలిగించింది. ఆ హోప్స్ తోనే సినిమాకి డీసెంట్ బిజినెస్ జరిగింది.

Thammudu

కానీ రిలీజ్ ట్రైలర్ ఆ హోప్స్ ని పోగొట్టేసింది. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ ఇంపాక్ట్ బాక్సాఫీస్ వద్ద కూడా ఎక్కువగానే కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.22.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ సినిమాకి ‘ఏ’ రేటింగ్ రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపించడం లేదు.

అందువల్ల బాక్సాఫీస్ వద్ద 30 శాతం ఆక్యుపెన్సీలు కూడా నమోదు కావడం లేదు. ‘మాచర్ల నియోజకవర్గం’ వరకు నితిన్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ పెట్టేవి. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ‘రాబిన్ హుడ్’ నుండి సీన్ రివర్స్ అవుతుంది.

‘తమ్ముడు’ (Thammudu) విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పాలి. ఇప్పటి ట్రెండ్ ను బట్టి చూసుకుంటే ‘తమ్ముడు’ (Thammudu) సినిమా మొదటి రోజు రూ.1.2 కోట్లు షేర్ మాత్రమే రాబట్టొచ్చు. సెకండ్ షోలకి ఆక్యుపెన్సీలు పెరిగితే.. ఫైనల్ డే 1 లెక్కల్లో మార్పు కనిపించొచ్చు.

‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus