పవన్ కళ్యాణ్, ప్రీతి జింగ్యాని జంటగా పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తమ్ముడు’. పవన్ కళ్యాణ్ అప్పటికే ‘తొలిప్రేమ’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యాయి. ‘శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్’ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1999వ సంవత్సరం జూలై 15న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 22 ఏళ్ళు పూర్తికావస్తోంది.
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ క్లాసిక్ గా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.20 cr |
సీడెడ్ | 1.85 cr |
ఉత్తరాంధ్ర | 1.18 cr |
ఈస్ట్ | 0.77 cr |
వెస్ట్ | 0.54 cr |
గుంటూరు | 0.78 cr |
కృష్ణా | 0.55 cr |
నెల్లూరు | 0.38 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్)+ రెస్ట్ ఆఫ్ ఇండియా | 9.25 |
ఓవర్సీస్ | 0.21 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.46 cr |
‘తమ్ముడు’ చిత్రం అప్పట్లో రూ.5.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.’తొలిప్రేమ’ సినిమాకి భారీగా వసూళ్లు రావడంతో బయ్యర్స్ ఈ చిత్రాన్ని ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.9.46 కోట్ల షేర్ ను రాబట్టింది.దీంతో బయ్యర్లకు రూ.4.26 కోట్ల లాభాలు అందినట్టు తెలుస్తుంది.ఈ చిత్రం ‘తొలిప్రేమ’ వసూళ్లను అధిగమించడమే కాకుండా… నైజాంలో ‘చూడాలని ఉంది’ మూవీ తర్వాత అత్యథిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!