Vijayashanti: అప్పుడు చిరు..ఇప్పుడు విజయశాంతి… సేమ్ టు సేమ్!

14 ఏళ్ళ గ్యాప్ తర్వాత 2020 లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి. మ‌హేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ రష్మిక కంటే ఈమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంలో ఈమె క్రేజ్ కూడా ఓ కారణమని చెప్పాలి.ఆ మూవీ తర్వాత మళ్ళీ విజయశాంతి సినిమాల్లో కొనసాగుతారేమో అని ప్రేక్షకులు ఆశించారు.

Click Here To Watch NOW

కానీ అలాంటిదేమి జరగలేదు.దీంతో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా కాలంగా ఆమెను బ్రతిమిలాడటం వలన ఆ మూవీ చేయడానికి ఆమె అంగీకరించారు. భవిష్యత్తులో ఎటువంటి సినిమాల్లో నటించను అని ఆమె తేల్చి చెప్పేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె కార్ వ్యాన్ లపై అలాగే ఇప్పటి సినిమా మేకింగ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ.. ” ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి సినిమా మేకింగ్ లో చాల మార్పులు వచ్చాయి. ఇప్పటి హీరో హీరోయిన్ల‌తో పాటు పేరున్న ఆర్టిస్టుల‌కు కూడా నిర్మాత‌లు కార‌వాన్‌ను సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందువల్ల బ‌డ్జెట్ పెరుగుతున్న మాట నిజం. కార‌వాన్ అనేది నాకు అస్సలు న‌చ్చ‌లేదు. అప్పట్లో అయితే నటీనటులు, యూనిట్ మెంబెర్స్ అంతా చెట్టుకింద కూర్చొని లంచ్ చేసేవాళ్లం. అంతా ఒక కుటుంబ స‌భ్యుల్లా కలిసి ఉండేవాళ్ళం. మిగ‌తా వాళ్లు ఏం తినేవాళ్లో మేం కూడా అదే తినేవాళ్లం.

ఇప్పుడు కార‌వాన్‌లో ఉండాలంటే చిరాకు అనిపించింది. ఏదో గుహ‌లో గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోబెట్టిన‌ట్లు అనిపించింది.బ‌య‌ట కూర్చుంటే చెట్లు, ప‌క్షులు, గాలి వంటివి ఉంటాయి, అంద‌రూ క‌న‌బడ‌తారు.మేక‌ప్ వేసుకోవ‌డానికో, డ్ర‌స్ చేంజ్ చేసుకోవ‌డానికో, వాష్ రూమ్‌కో అయితే పర్వాలేదు. కానీ గంట‌లు, గంట‌లు అందులో కూర్చోవాలంటే అసహ్యం కలిగింది” అంటూ ఈమె చెప్పుకొచ్చింది.గతంలో చిరంజీవి కూడా ఇలాంటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus