యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘తండేల్’ (Thandel) సినిమా రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. ‘లైలా’ (Laila) ‘బ్రహ్మ ఆనందం’ వంటి సినిమాలు రిలీజ్ అయినా వాటికి టాక్ తేడా కొట్టడం అనేది ‘తండేల్’ కి అడ్వాంటేజ్ గా మారింది అని చెప్పుకోవచ్చు. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం, సాయి పల్లవి- నాగ చైతన్య కాంబో వల్ల రిపీటెడ్ ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నట్టు స్పష్టమవుతుంది.
ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 18.01 cr |
సీడెడ్ | 5.56 cr |
ఉత్తరాంధ్ర | 5.87 cr |
ఈస్ట్ | 2.68 cr |
వెస్ట్ | 1.93 cr |
కృష్ణా | 2.15 cr |
గుంటూరు | 2.08 cr |
నెల్లూరు | 1.17 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 39.45 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.95 cr |
ఓవర్సీస్ | 4.43 Cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 47.83 cr (షేర్) |
‘తండేల్’ చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.47.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.11.83 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. గ్రాస్ పరంగా రూ.85 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.