Thandel Collections: నాగ చైతన్య కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ‘తండేల్’ ..!

Ad not loaded.

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) సినిమా నిన్న అంటే ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బన్నీవాస్ (Bunny Vasu)  నిర్మించారు. అల్లు అరవింద్  (Allu Aravind)  సహా నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. దేవి శ్రీ ప్రసాద్  (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. దీంతో సినిమాపై బజ్ పెరిగింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

Thandel Collections:

దీంతో అన్ సీజన్ అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.16 cr
సీడెడ్ 1.20 cr
ఉత్తరాంధ్ర 1.01 cr
ఈస్ట్ 0.70 cr
వెస్ట్ 0.65 cr
కృష్ణా 0.60 cr
గుంటూరు 0.50 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr
తమిళనాడు 0.04 cr
ఓవర్సీస్ 2.18 cr
టోటల్ వరల్డ్ వైడ్ 11.14 cr (షేర్)

‘తండేల్’ చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ.11.14 కోట్ల షేర్ ను రాబట్టింది. నాగ చైతన్య కెరీర్లోనే ఇవి హయ్యెస్ట్ ఓపెనింగ్స్. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.24.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus