Thangalaan: తంగలాన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మారిందా.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల ఓటీటీ హక్కులలో మెజారిటీ సినిమాలను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో నెట్ ఫ్లిక్స్ పెద్ద సినిమాల డిజిటల్ హక్కుల విషయంలో అస్సలు రాజీ పడటం లేదనే చెప్పాలి. అయితే విక్రమ్ తంగలాన్ (Thangalaan) మూవీ ఆగష్టు 15న థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా తమిళంలో మాత్రం ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

Thangalaan

అయితే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. కొన్ని కారణాల వల్ల నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తంగలాన్ మూవీ డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయని ప్రచారం జరుగుతుండగా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కొన్ని సినిమాలు సైతం ఓటీటీ సమస్యల వల్ల ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.

తంగలాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైతే మాత్రం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. తంగలాన్ సినిమా కోసం విక్రమ్ ఎంతో కష్టపడ్డారు. విక్రమ్ (Vikram)  సినిమాను థియేటర్లలో చూడటం మిస్సైన ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

తంగలాన్ మూవీలో తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సంచలనాలు సృష్టించలేదని అభిమానులు ఫీలవుతున్నారు. విక్రమ్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హైదరాబాద్లో మెరిసిన అమ్రిష్ పూరి మనవడు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus