Thank You Collections: మొదటి రోజే దారుణమైన కలెక్షన్లు…!

Advertisement

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘మనం’ తర్వాత వచ్చిన మూవీ ‘థాంక్యూ’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ వంటి క్రేజీ హీరోయిన్లు నటించిన నిన్న అంటే జూలై 22న విడుదలయ్యింది.మొదటి షోతోనే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ చాలా దారుణంగా నమోదయ్యాయి.

నాగ చైతన్య కెరీర్లో ఈ మధ్య కాలంలో అతి తక్కువ ఓపెనింగ్స్ నమోదు కావడం ఈ సినిమాతోనే జరిగింది. ఒకసారి ‘థాంక్యూ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.70 cr
సీడెడ్ 0.22 cr
ఉత్తరాంధ్ర 0.25 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.08 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.12 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 cr
ఓవర్సీస్ 0.45 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.23 cr

‘థాంక్యూ’ మూవీ రూ.23.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. క్లీన్ హిట్ అనిపించుకోవడానికి అంత మొత్తం రాబట్టాలి. కానీ మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.2.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ మధ్య కాలంలో నాగ చైతన్య సినిమాలకు ఇంత దారుణమైన ఓపెనింగ్స్ నమోదవ్వడం ఈ సినిమాతోనే జరిగింది.

ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.21.62 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండో రోజు కూడా ఈ మూవీ బుకింగ్స్ ఏమాత్రం బాగా జరగలేదు. కాబట్టి.. ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.10 కోట్ల షేర్ ను అయినా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus