Thank You Collections: ‘థాంక్యూ’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది కానీ లాభం లేదు.?

Advertisement

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘మనం’ తర్వాత వచ్చిన మూవీ ‘థాంక్యూ’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ వంటి క్రేజీ భామలు నటించిన ఈ మూవీ జూలై 22న విడుదలయ్యింది.కానీ మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ దారుణంగా నమోదయ్యాయి. నాగ చైతన్య కెరీర్ లో ఇవి డిజాస్టరస్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎదురీదుతోంది. డిజాస్టర్ రిజల్ట్ నుండి తప్పించుకునే అవకాశాలు అయితే లేవు కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎదురీదుతూనే ఉంది. ఒకసారి ‘థాంక్యూ’ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.30 cr
సీడెడ్ 0.42 cr
ఉత్తరాంధ్ర 0.56 cr
ఈస్ట్ 0.30 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.22 cr
కృష్ణా 0.24 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 cr
ఓవర్సీస్ 0.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.46 cr

‘థాంక్యూ’ మూవీ రూ.23.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. క్లీన్ హిట్ అనిపించుకోవడానికి అంత మొత్తం రాబట్టాలి. కానీ 6 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ.4.46 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ మధ్య కాలంలో నాగ చైతన్య సినిమాలకు ఇంత దారుణమైన ఓపెనింగ్స్ నమోదవ్వడం ఈ సినిమాతోనే జరిగింది.

బుధవారం రోజున ఈ చిత్రం రూ.13 లక్షల షేర్ తో సరిపెట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమనే చెప్పాలి. ఈ శుక్రవారం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ అవుతుంది కాబట్టి ‘థాంక్యూ’ కి కష్టమే..!

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus