Naga Chaitanya: సినిమా హిట్ అయితే వాళ్ళ క్రెడిట్.. ప్లాప్ అయితే చైతన్య పై తోసేస్తారా?

ఇటీవల రిలీజ్ అయిన ‘థాంక్యూ’ చిత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. అందులోనూ క్లాస్ మూవీ అంటే వాళ్ళు థియేటర్లకు రావడం లేదు. పెద్ద సినిమాలు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడని పరిస్థితి. మరో పక్క వర్షాల ఎఫెక్ట్ ఎలానూ ఉంది. అన్నిటికీ తోడు సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ‘థాంక్యూ’ మరీ తీసిపారేసే సినిమా కాదు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది.

అయితే ఈ చిత్రం ఫలితాన్ని బట్టి… నాగచైతన్య కి ఏమాత్రం బాక్సాఫీస్ స్టామినా లేదు అని కొంతమంది అంటున్నారు. అదేంటి మరి.. అతని గత చిత్రాలు నాలుగు హిట్ అయ్యాయి కదా అంటే.. అందులో ‘మజిలీ’ ‘లవ్ స్టోరీ’.. సమంత, సాయి పల్లవి ల స్టార్ ఇమేజ్ కలిసొచ్చి సూపర్ హిట్ అయ్యాయట. ఇక ‘వెంకీ మామ’ ‘బంగార్రాజు’ అయితే నాగార్జున, వెంకటేష్ ల క్రేజ్ వల్ల మంచి ఫలితాలు అందుకున్నాయి.. అవి చైతన్య బాక్సాఫీస్ స్టామినా పై ఆధారపడి హిట్టయిన సినిమాలు కావు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే సమంత సోలోగా చేసిన సినిమాలు రూ.25 కోట్లు షేర్ ను వసూల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? పోనీ ఇటీవల సాయి పల్లవి నటించిన ‘విరాటపర్వం’ ‘గార్గి’ చిత్రాలు భారీగా కలెక్ట్ చేశాయా? సరే హీరోయిన్ల సంగతి పక్కన పెట్టేద్దాం.. వెంకటేష్ సినిమాలకు రూ.40 కోట్ల మార్కెట్ ఎక్కడ ఉంది? నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రం ఎంత కలెక్ట్ చేసింది? ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కథా చైతన్యకి బాక్సాఫీస్ స్టామినా లేదు అని చెప్పాలి.

దిల్ రాజు సినిమా అయినంత మాత్రాన కలెక్షన్లు వచ్చేస్తాయా? ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేయడం అనేది పూర్తిగా ఆ చిత్రానికి ఉండే బజ్, అది రిలీజ్ అయిన టైం.. వీటన్నిటి పై ఆధారపడి ఉంటుంది. అంతేకానీ చైతన్యని ‘థాంక్యూ’ రిజల్ట్ కు బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని చెప్పాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus