Tharun Bhascker: ఇంటర్వ్యూ : ‘కీడా కోలా’ ప్రమోషన్స్ లో దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

‘పెళ్ళిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి రెండు సెలబ్రేటెడ్ మూవీస్ ని ప్రేక్షకులకు అందించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. కొంత గ్యాప్ తర్వాత ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో అతను కూడా నటించడం విశేషం. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తరుణ్ భాస్కర్ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం :

ప్ర) ఇంత గ్యాప్ తర్వాత ‘కీడా కోలా’ అనే చిన్న సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?

తరుణ్ భాస్కర్ : నాకు మాత్రమే కాదు లాక్ డౌన్ వల్ల అందరికీ కెరీర్లో గ్యాప్ అనేది వచ్చింది. నేను చాలా కథలు రాసుకున్నాను. అయితే అన్నీ డెవలపింగ్ స్టేజిలో ఉన్నాయి. కానీ ‘కీడా కోలా’ అన్ని విధాలుగా కుదిరింది. లాక్ డౌన్ టైంలో చాలా మంది రకరకాలుగా డబ్బులు సంపాదించారు. రోడ్ పై మ్యాన్ హోల్ కవర్ లేదు. ఎవడో ఇనప సామాన్లు వాడికి అమ్మేసాడట. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది నాకు ఫన్నీగా అనిపించింది. అందుకే ‘కీడా కోలా’ మొదలుపెట్టాను.

ప్ర) ‘కీడా కోలా’ లో ఆ పురుగు ఐడియా కూడా అలాగే తీసుకున్నారా?

తరుణ్ భాస్కర్ : అవును తినే పదార్ధాల్లో పురుగు పడిందని కేసు వేసి కూడా సంపాదించవచ్చు అని అన్నారు. అదే దీనికి స్ఫూర్తి. ఇదంతా క్రైమ్ అయినప్పటికీ దూరం నుండి చూస్తే కామెడీ. ప్రతి క్రైమ్ దూరం నుండి చూస్తే కామెడీ అని నాకు అనిపిస్తుంది. కానీ ఇది నా ఫేవరేట్ జోనర్.

ప్ర) క్రైమ్ అండ్ కామెడీతో ‘కీడా కోలా’ ని రూపొందించొచ్చు అని ఎందుకు అనిపించింది?

తరుణ్ భాస్కర్ : చిన్నప్పటి నుండి నా ఫేవరేట్ జోనర్ ఇది. నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ మనీ మనీ. అందులో బ్రహ్మానందం గారి పాత్ర చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం కూడా.! అలాగే జిగర్తండా, సుదుకవ్వం చిత్రాలు కూడా ఇష్టం. రొమాంటిక్ కామెడీలు నాకు బోరింగ్ సబ్జెక్ట్. నాతో పాటు నా ఫ్రెండ్స్ కి కూడా క్రైమ్ కామెడీలే ఇష్టం. ఇప్పుడీ సినిమాతో క్రైమ్ కామెడీ కల నిజమైంది.

ప్ర) మరి ‘పెళ్ళి చూపులు’ కూడా చేశారు కదా?

తరుణ్ భాస్కర్ : నిజమే..! కానీ అందులో క్లైమాక్స్ నాకు నచ్చలేదు. కానీ తప్పక పెట్టాల్సి వచ్చింది. ముందుగా నేను ఆ సినిమా కథ రాసుకున్నప్పుడు క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్లు విడిపోతారు. అయితే కొన్ని చర్చల తర్వాత అలా మార్చాల్సి వచ్చింది.

ప్ర) మీకు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన మూవీ కూడా అది. సో ఎప్పుడైనా దానిని బర్డెన్ గా ఫీలయ్యారా?

తరుణ్ భాస్కర్ : ‘బాధ్యత’ లాంటి మాటలు విన్నప్పుడు చాలా బరువుగా ఉంటుంది. ఆ బరువుని పక్కన పెడదామని ‘ఈ నగరానికి ఏమయింది’ చేశాం. ఈ సినిమా ఇంకా బరువుని పెంచింది. ( నవ్వుతూ)

ప్ర) ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కదా.. పైగా ‘నువ్వు నీ ఫ్రెండ్స్ తో గోవా వెళితే మాకు డాక్యుమెంటరీలా ఎందుకు తీసి చూపిస్తున్నావు?’ అని క్రిటిక్స్ కూడా కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయిగా?

తరుణ్ భాస్కర్ : నిజమే.. కానీ ఆ సినిమాపై ముందు నుండి నాకు కాన్ఫిడెన్స్ అయితే లేదు. ముందుగా ఆ సినిమాకి ‘కన్యా రాశి ‘ అనే టైటిల్ పెట్టుకున్నాను. తర్వాత కొంతమంది ‘పెళ్ళిచూపులు’ ‘కన్యారాశి’ నెక్స్ట్ ‘మృగశిర’ నా? అని కామెంట్స్ చేశారు. అప్పుడు చిరాకు వచ్చి పోతే పోయింది అని ‘ఈ నగరానికి ఏమైంది?’ టైటిల్ పెట్టాను. అది అప్పుడు వర్కౌట్ అవ్వకపోయినా, రీ రిలీజ్ లో బాగా వర్కౌట్ అయ్యింది. సో మొదట్లో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోలేదు.

ప్ర) బ్రహ్మానందం గారిని వీల్ చెయిర్ లో కూర్చోబెట్టాలని ఎందుకు అనిపించింది ?

తరుణ్ భాస్కర్ : ఆ పాత్రకి మా తాత గారు స్ఫూర్తి. ఆయనది చాలా ఫన్నీ క్యారెక్టర్. నాకు మా తాత గారికి చాలా మంచి బాండింగ్ కూడా ఉంది. ముందుగా ఈ పాత్ర కోసం అల్లు అరవింద్ గారిని, మురళీధర్ గౌడ్ ని ఇలా చాలా మందిని అనుకున్నాం. అయితే బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ నా ఫ్రెండ్. ఒకరోజు అతన్ని అడిగి బ్రహ్మానందం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది.

ప్ర) పోస్టర్ లో చైతన్యని ఎక్కువగా చూపిస్తున్నారు .. ఇతనే హీరో అనుకోవచ్చా ?

తరుణ్ భాస్కర్ : ఇందులో మొత్తం 8 పాత్రలు ఉంటాయి. అందులో హీరో ఎవరనేది ఆడియన్స్ సినిమా చూశాకే నిర్ణయించాలి. అందుకే నేను మా రైటింగ్ టీంతో కూడా బెట్ వేశాను.( నవ్వుతూ)

ప్ర) మీ డైరెక్షన్లో మీరు చేస్తున్న మొదటి సినిమా ఇది.. ?

తరుణ్ భాస్కర్ : నాయుడు అనే పాత్ర నాలో లేని ఓ డార్క్ యాంగిల్ ని ఊహించుకుని రాసుకున్నాను. ఇది చాలా కష్టం అనిపించింది. కాకపోతే వేరే వాళ్ళ దర్శకత్వంలో చేస్తున్నప్పుడు వాళ్ళ డైలాగులు నాకు ఇబ్బందిగా అనిపించేది. కానీ ఈ సినిమాకి అంతా నా టీమే కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేశాను.

ప్ర) సినిమా రన్ టైం కూడా 2 గంటలే ఉంది.. ఎడిటింగ్ లో ఎక్కువ భాగం కట్ చేశారా?

తరుణ్ భాస్కర్ : లేదు.. రాసుకున్నప్పుడు, తీసినప్పుడు … రెండు గంటల ఇరవై నిమిషాలు వచ్చింది. పదిహేను నిమిషాలు ట్రిమ్ చేశాను. క్రైమ్ కామెడీ నేచర్ క్రిస్ప్ గా ఉండటం. నెరేటివ్ పరిగెడుతూనే ఉంటుంది. కీడా కోలా కూడా ఫాస్ట్ పేస్డ్ అండ్ యూనిక్ గా ఉండాలి అనే ఉద్దేశంతో..!

ప్ర) గతంలో మీరు వెంకటేష్ గారితో ఓ సినిమా అనుకున్నారు. అది ఎందుకు రాలేదు?

తరుణ్ భాస్కర్ : అవును. ఆ సినిమా ఉంటుంది. సురేష్ బాబు గారు ప్రొసీడ్ అవ్వమన్నారు. అయితే కథ కోసం మరింత సమయం తీసుకున్నాను. ఇప్పుడు సిద్ధంగా (Tharun Bhascker) ఉన్నాను. అలాగే ఓ వెబ్ సిరిస్ కూడా ప్లానింగ్ లో ఉంది.!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus