బన్నీ ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్

ఒక సినిమాలోని హీరో లేదా విలన్ లేదా హీరోయిన్ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వాలంటే.. సదరు పాత్రకి ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఉండాలి. ఈమధ్యకాలంలో ఆస్థాయి డీప్ & హైలైట్ చేయదగిన క్యారెక్టరైజేషన్ తో వచ్చిన హీరో పాత్ర “కె.జి.ఎఫ్”లో యష్ క్యారెక్టర్. సినిమాలో అతడి స్ట్రగుల్ ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే ఆ క్యారెక్టర్ కి జనాలు భీభత్సంగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు “అల వైకుంఠపురములో” చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కు కూడా ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్రియేట్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో డీప్ క్యారెక్టరైజేషన్స్ ఉండవు. ఆయన సినిమాల్లో సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కానీ.. బన్నీ క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలని ఒక 5 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ను రెడీ చేశాడట త్రివిక్రమ్. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి బన్నీ ఫ్యాన్స్ షాక్ అవ్వడం గ్యారెంటీ అని ఇంసైడ్ టాక్. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరాం, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus