‘అతి జోక్యం’ కొంప ముంచేసిందా?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ తొలి ఎలిమినేషన్‌ కు రంగం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు నాగార్జున వచ్చి… హౌస్ మేట్స్ ని నవ్వించి, ఆడించి… ఒకరిని బయటకు తీసుకొచ్చేస్తాడు. అదేనండి ఎలిమినెట్ చేస్తారు. నిన్న అభిజీత్, సుజాత, గంగవ్వని సేఫ్ చేసేసారు. ఈ రోజు ఇంకా ముగ్గురు ని సేఫ్ చెయ్యాలి. ప్రస్తుతం ఎలిమినేషన్ లైన్ లో ఉన్నది దివి, మెహబూబ్, అఖిల్, సూర్య కిరణ్. ఇందులో అందరూ ఊహించే ‘అతి’ కాండిడేట్ వెళ్ళిపోతాడు. మొన్నటివరకు ఎలిమినేషన్‌ పక్కా అనుకున్న పేర్లలో దివి ఒకటి. మొత్తం ఎపిసోడ్‌లో పది సెకన్ల స్క్రీన్‌ స్పేస్‌ కూడా ఆమెకు ఇవ్వలేదు. అంతగా ఫర్నిచర్‌లో కలసిపోయింది. అయితే దివి ఒక్క ఎపిసోడ్‌తోనే స్టార్‌ అయిపోయింది. మొన్న ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ దివి’ కార్యక్రమంలో ఆమె ఇంటి సభ్యుల గురించి చెప్పిన మాటలు, అమె అభిప్రాయాలు ప్రజలకు బాగా నచ్చేశాయి.

‘మా దివి మాట్లాడిందోచ్‌’ అంటూ నెటిజన్ల తెగ సందడి చేశారు. ఆ రెండో రోజు అంటే నిన్న అమ్మ రాజశేఖర్‌ – దివి మధ్య జరిగిన పులిహోర కాన్సెప్ట్‌ కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమె ఓట్ల గ్రాఫ్‌ పెరిగిందని చెప్పొచ్చు. మామూలుగా అయితే అఖిల్‌ ఈ వారం ఎలిమినేట్‌ ఫైనల్‌ లిస్ట్‌లో ఉండేవాడే. అయితే ‘కట్టప్ప ఎవరు?’ టాస్క్‌లో అఖిల్‌ పేరు అందరి నోళ్లలో నానింది. దీంతో నెటిజన్లుకు అంతగా టచ్‌లో లేని అఖిల్‌ కూడా ఈసారి మంచి ఓట్లే సంపాదించాడు. ఇక మిగిలింది ఇద్దరు. మెహబూబ్‌, సూర్యకిరణ్‌. ఇందులో సూర్యకిరణ్‌ అంటే ఇంట్లో ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. అందరిమీద అజమాయిషీ చలాయించాలని చూడటం, ఏ ఇద్దరు మాట్లాడుతున్నా మధ్యలోకి వెళ్లి తను చెప్పించే చేయాలి అనడం లాంటివి సూర్యకిరణ్‌ను ఇంట్లో బ్యాడ్‌ చేశాయి.

కాబట్టి ఈ సారి సూర్యకిరణ్‌ డేంజర్‌లో ఉన్నట్లే. మెహబూబ్ ఎక్కడా సోలో స్క్రీన్‌ స్పేస్‌ దక్కలేదు. అంటే పర్‌ఫార్మెన్స్‌ అంత అట్రాక్టివ్‌గా లేదనే చెప్పాలి. ఆఖరికి దివి అభిప్రాయాలు చెప్పినప్పుడు మెహబూబ్‌ గురించి టెలీకాస్ట్‌ చేయలేదు. అయితే మెహబూబ్ కి సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ‘అతి’ సూర్య కిరణ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus