ఆ ఘనత దక్కించుకుంది వెంకటేష్ హీరోయినే..?

ఇప్పుడు మన తెలుగు సినిమా హీరోయిన్లు..1 కోటి నుండీ 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు సినిమాతో అత్యధిక పారితోషికం తీసుకుంది మాత్రం.. మన తెలుగు హీరోయిన్ కాదు. విక్టరీ వెంకటేష్ హీరోగా కె.విజయ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘మల్లీశ్వరి’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ కామెడీతో ఇప్పటికీ నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉన్నాడు.ఈ సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.

వైజాగ్ బీచ్ లో ఈమె వర ప్రసాద్ తో తిరిగే మల్లీశ్వరి పాత్రలో మంచి నటన కనపరిచింది. గ్లామర్ పరంగా కూడా ఈమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఈమెకు ఇది మొదటి చిత్రం. ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డి.సురేష్ బాబు నిర్మించారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘మల్లీశ్వరి’ చిత్రానికి కథ,మాటలు అందించాడు. అయితే ఈ చిత్రం కోసం హీరోయిన్ కత్రినా కైఫ్ కు భారీ మొత్తం ఇచ్చి.. తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ చిత్రం కోసం ఈమెకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా.. ?

అక్షరాలా 75 లక్షలు. ఇప్పట్లో ఓ ఐటెం సాంగ్ కోసమే స్టార్ హీరోయిన్లు ఇంత పెద్ద మొత్తం తీసుకుంటున్నారు.. కానీ 2004 లో ఇది చాలా పెద్ద అమౌంటే..! అందులోనూ అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న మొట్ట మొదటి హీరోయిన్ కత్రినానే కావడం విశేషం. తరువాత ఈమె బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ అనే చిత్రంలో కూడా నటించింది. కానీ ఆ చిత్రం హిట్టవ్వకపోవడంతో తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus