Bigg Boss 7 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో అమర్ ఫైట్..! గెలిచాడా ? ఓడిపోయాడా ?

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ అనేది నడుస్తోంది. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఫ్లేర్ ఈజ్ లావా అంటూ గార్డెన్ ఏరియాలో కొన్ని హర్డిల్స్ ఇచ్చాడు. అవి దాటుకుంటూ వెళ్లి బ్రిక్స్ ని తీస్కుని రావాలి. అలా ప్రతి సారి ఒక్కో రౌండ్ లో ఒక్కో పార్టిసిపెంట్ ఎలిమినేట్ అవుతాడు. ఫస్ట్ రతిక, ఆ తర్వాత గౌతమ్ ఈ రేస్ నుంచీ తప్పుకున్నారు. ఇలా ఒక్కొక్కరుగా తప్పుకుని ఫైనల్ గా ముగ్గురు మాత్రమే మిగిలి నెక్ట్స్ లెవల్ టాస్క్ ఆడబోతున్నారు. అయితే, ఈ ఫ్లోర్ ఈజ్ లావా అనే టాస్క్ లోనే పెద్ద యుద్ధం జరిగింది.

రీసంట్ గా రిలీజైనా ప్రోమోలో చూస్తుంటే., యావర్ వేరేవాళ్ల బ్రిక్స్ తన దాంట్లో పెట్టుకుంటున్నాడు. ఇలాగ ప్రతి రౌండ్ లో ఒక్కొక్కరు తొలగిపోయిన తర్వాత ఫైనల్ గా అర్జున్, ప్రియాంక, ఇంకా అమర్ దీప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటాస్క్ లో అమర్ దీప్ బ్రిక్స్ కోసం గొడవ పెట్టుకున్నాడు. ఇక్కడే శోభాశెట్టి ఆవేశపడింది. సంచాలక్ గా నేనెందుకు ఉన్నానంటూ గోల చేసింది. పల్లవి ప్రశాంత్ ఇటుక అది నాది అక్కడ పడిపోయిందన్నాడు. ప్రతిదీ మీది మీది ఇంటారేంటి అంటూ అమర్ వాదన పెట్టుకున్నాడు.

మొత్తం మీరే తీస్కోండి అన్నాడు. అందుకే కింద వేస్కోకూడదంటూ అరిచాడు. దీనికి శోభాశెట్టి రియాక్ట్ అయ్యింది. సంచాలక్ గా నేను చూస్తున్నా కదా.. మీలో మీరే వాదన పెట్టుకుంటే ఎలా అంటూ గట్టిగా అరిచింది. అంతకు ముందు కూడా పల్లవి ప్రశాంత్ తో సంచాలక్ గా ఉన్నప్పుడు గొడవ పెట్టుకుంది శోభా. డెసీషన్ తీస్కోవడానికి చాలాసేపు మంతనాలు చేసింది. ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో కూడా గట్టిగా అరుస్తూ నేను చెప్తా ఆగండి అంటూ దబాయించింది.

ఇక కెప్టెన్సీ టాస్క్ లో అర్జున్ – ప్రియాంక – అమర్ లాస్ట్ వరకూ ఉన్నారు. వీరికి జరిగిన లెవల్ టూ లో అర్జున్ అవుట్ అవ్వగా ఫైనల్ గా అమర్ వర్సెస్ ప్రియాంక పోటీ పడ్డారు. ఇందులో ప్రియాంక ఈవారం కెప్టెన్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అమర్ బ్రిక్స్ గేమ్ లో పోటీపడ్డాడు ఫైట్ చేశాడు. ఆ లెవల్ ని దాటాడు. ఫైనల్ గా ప్రియాంక తో పోటీపడి ఓడిపోయాడు. దీంతో ప్రియాంక 11వ వారం ఇంటి కెప్టెన్ అయ్యింది. ఈ కెప్టెన్సీ టాస్క్ అనేది ఇంటి సభ్యుల మద్యలో పెద్ద చిచ్చే పెట్టింది.

ఇప్పటికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల హౌస్ మేట్స్ (Bigg Boss 7 Telugu) మద్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ వల్ల శోభాశెట్టి – ప్రియాంక – అమర్ మద్యలో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి. దీనివల్ల సీరియల్ బ్యాచ్ వచ్చేవారం ఎలా గేమ్ ఆడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈవారం ప్రియాంక ఇంకా శోభా ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ కెప్టెన్సీ అనేది ప్రియాంకకి ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది చూడాలి. అదీ మేటర్.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus