Chiranjeevi, Ram Chran: తండ్రి సినిమాలో కొడుకు అయిపోయింది… ఇప్పుడు కొడుకు సినిమాలో తండ్రి!

ఒక సినిమా గురించి అంచనాలు, ఆసక్తులు ఎప్పుడు తప్పిపోతాయి అంటే.. ఆ సినిమా గురించి అప్‌డేట్‌లు ఆగిపోయినప్పుడు. అలాగే సినిమా షూటింగ్‌ ఎప్పుడు ఉంటుందో తెలియనప్పుడు, ఫైనల్‌గా సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో ఎంతకీ క్లారిటీ రానప్పుడు. ఇలాంటి అన్ని అంశాలు ప్రస్తుతం ఉన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దీంతో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు మరో సినిమా మీద దృష్టి సారించారు. అదే బుచ్చిబాబు సానా సినిమా. ‘ఉప్పెన’తో తొలి సినిమాకే జాతీయ పురస్కారం గెలుచుకున్న దర్శకుడు ఆయన.

దీంతో బుచ్చిబాబు తర్వాతి సినిమా ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది. మరోవైపు ఈ సినిమా కోసం కాస్టింగ్‌, క్రూ విషయంలో కూడా పెద్ద ఎత్తున అంచనాలు మొదలయ్యాయి. వీటికి భారీ యాడ్‌ ఆన్‌గా కొత్త విషయం ఒకటి బయటకొచ్చింది. అదే ఈ సినిమాలో చిరంజీవి నటిస్తుండటం. రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సినిమాలో చిరంజీవి కోసం ఓ అతిథి పాత్ర ఉంది అని అంటున్నారు. ఇంకా సినిమానే మొదలుకాలేదు.. అప్పుడే పాత్రల గురించి, అతిథి పాత్రల గురించి పుకార్లు మొదలయ్యాయి.

గ్రామీణ క్రీడా నేపథ్యంలో బుచ్చిబాబు – రామ్‌చరణ్‌ (Ram Chran) సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆ మేరకు ఈ సినిమాలో చరణ్ పాత్రకు మెంటార్‌ లాంటి ఓ పెద్ద పాత్ర ఉందని, ఆ పాత్ర గురించి చిరంజీవికి చెప్పారని ఓ టాక్‌ నడుస్తోంది. అయితే చిరు నుండి ఇంకా అంగీకారం రాలేదు అని కూడా చెబుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణను డిసెంబరు నుండి ప్రారంభిస్తారని ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఆ రోజున ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

ఇక ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కూడా నటిస్తున్నాడు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తారు. ఈ రెండూ అధికారికం. ఇవి కాకుండా ఈ సినిమాలో హీరోయిన్లుగా జాన్వీ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తారు అని కూడా వార్తలొచ్చాయి. దీంతో ఏ పుకారు నిజమో, ఏది కాదో అర్థం కావడం లేదు. చిరంజీవి వార్త విషయంలో క్లారిటీ ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి. ఒకవేళ నటిస్తే చరణ్‌ సినిమాలో చిరు మరోసారి నటించినట్లు అవుతుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus