సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లు క్లాస్ సినిమాలను, క్లాస్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లు మాస్ సినిమాలను హ్యాండిల్ చేయలేరు. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఏ జానర్ అయినా సక్సెస్ సాధించగల సామర్థ్యం ఉన్న డైరెక్టర్లలో ఒకరు. సుకుమార్ సినిమాలలో ట్విస్టులు ఊహలకు అందని విధంగా ఉంటాయి. ఈ లక్షణమే సుకుమార్ ను స్టార్ డైరెక్టర్ ను చేసింది. ఒకవైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా కూడా సుకుమార్ కు విజయాలు దక్కుతున్నాయి.
సుకుమార్ (Sukumar) కథ, కథనం కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకెళ్లే టాలెంట్ ఉన్న దర్శకుడు సుకుమార్ అని చెప్పవచ్చు. ఈ రీజన్ వల్లే సుకుమార్ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. రంగస్థలం, పుష్ప ది రైజ్ సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటనే ప్రశ్నకు ఈ రెండు సినిమాలలో ఇంటర్వెల్ ట్విస్ట్ లు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉంటాయనే సంగతి తెలిసిందే.
విరూపాక్ష సినిమా స్క్రిప్ట్ లో సుకుమార్ మార్పులు చేయకుండా ఉండి ఉంటే ఆ సినిమా ఈ రేంజ్ సక్సెస్ ను సాధించి ఉండదు. సుకుమార్ తన సినిమాలలో ప్రతి సీన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని విధంగా కథ, కథనంతో సుకుమార్ అంచనాలను పెంచేస్తారు. రాబోయే రోజుల్లో సుకుమార్ మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.
ప్రస్తుతం పుష్ప2 సినిమాతో సుకుమార్ బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ద్వారా పుష్ప2 సినిమా వేరే లెవెల్ లో ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!