అందుకే ఎన్టీఆర్ సినిమాల్లో నటించే అవకాశం రాలేదు : శ్రీనివాస్ రెడ్డి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డితో అప్పట్లో మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి కూతురికి పేరు పెట్టడంతో పాటు ఉయ్యాల ఫంక్షన్ కి కూడా వెళ్ళి ఆశీర్వదించాడు తారక్. అయితే కొంతకాలానికి ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీనివాస రెడ్డి నటించలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ సినిమాలకు దూరం కావడానికి చాలా కారణాలున్నాయని చెప్పాడు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ”2009లో ఎన్టీఆర్ టీడీపీ తరుపున ఎలెక్షన్ ప్రచారానికి వెళ్తున్నప్పుడు… అతడితో పాటు కొందరం స్నేహితులం కూడా వెళ్ళాం. నేను ఎన్టీఆర్ ప్రచారం ఖమ్మం వచ్చిన తరువాత జాయిన్ అవుతానని చెప్పాను.. అదే సమయానికి పండగ వచ్చింది. అందరం ఊళ్ళకు బయలుదేరాం. తారక్ నన్ను కారు ఎక్కమన్నారు. అయితే నాతో పాటు పెద్ద బ్యాగ్ కూడా ఉంది. అది తెచ్చుకునేలోపు ఆ ప్లేస్ లో ఇంకొకరు ఎక్కారు. ఆ కారు బయలుదేరింది. అప్పుడు నేను వెనుక కారులో వెళ్ళాను.. కొంత దూరం వెళ్ళిన తరువాత తారక్ కార్ కి యాక్సిడెంట్ అయ్యింది.

తారక్ గాయాలతో రక్తం కారుతూ కనిపించడంతో వెంటనే నా బ్యాగ్ లో ఉన్న టవల్ ఆయనకి చుట్టి నా కార్ లో ఎక్కించుకొని దగ్గరలో హాస్పిటల్ కి తీసుకెళ్ళాను.. ఆ తరువాత కిమ్స్ కి తీసుకువెళ్ళాం .. ఈ ప్రాసెస్ లో ఓ వ్యక్తి ‘నువ్ అడుగుపెట్టావ్.. తారక్ కి యాక్సిడెంట్ అయ్యింది’ అన్నాడు. నన్ను అంత మాట అనేశాడని.. ‘నేను ఉండబట్టే తారక్ ప్రాణాలతో వచ్చాడు.. లేకపోతే ఏమయ్యేదో’ అని అన్నాను. ఆ మాట తారక్ వరకు వెళ్ళడంతో ఆయనతో నటించే అవకాశం రాలేదు. బహుసా నేను అన్న దానికి మరికొంత యాడ్ చేసి తారక్ కి చెప్పుంటారని నా అభిప్రాయం. అయితే ఇది జరిగిన తరువాత తారక్ ని కలిసి సరదాగా మాట్లాడే అంత బాండింగ్ లేదు. ఒకసారి తారక్ ని కలిసి ఈ మేటర్ ను క్లియర్ చేసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus