kantara: ‘కాంతార’ సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా?

2022 లో కొన్ని కన్నడ సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. అందులోనూ ‘కాంతార’ సినిమా అత్యధిక లాభాలను అందించిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. తెలుగులో ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా లాభాలను అందించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘కె.జి.ఎఫ్'(సిరీస్) నిర్మాతలు నిర్మించారు. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.

బాలీవుడ్లో కూడా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భూత కోలా అనే ఎపిసోడ్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. అయితే ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది ఈ సినిమా బాలేదు అంటున్నారు, మరికొంతమంది యావరేజ్ అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం సినిమా సూపర్ అంటున్నారు. ఇదిలా ఉండగా… ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతుంది.

కొంతమంది ఈ సినిమా లాజిక్ లెస్ అని అంటున్నారు. ఈ సినిమా కథలోనే చాలా లాజిక్ మిస్ అయ్యిందట. ఆ మిస్టేక్ ఎలా గాలికొదిలేశారు అంటూ నెటిజన్లు నెత్తి కొట్టుకుంటున్న ఈమోజీలు పెడుతున్నారు. అసలు మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో కోలం ఆడే వ్యక్తిలో దేవుడు ప్రవేశించి జరగబోయేది చెబుతుంటాడు. ఒక రాజు అడవిలో ఉండే జనాలకు తన భూమిని దానం చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత అతని వారసుడు వచ్చి ఆ భూమి నాది అంటాడు. కోలం ఆడే వ్యక్తితో (హీరో తండ్రితో) అతను ‘నా భూమి నాకు కావాలి’ అంటాడు.

అప్పుడు ఆ కోలం ఆడే వ్యక్తిలో దేవుడు ప్రవేశించి ‘నువ్వు కోర్టు మెట్ల పై రక్తం కక్కుకుని చనిపోతావ్’ అంటాడు. అతను అన్నట్టే ఆ వ్యక్తి కోర్టు మెట్ల పై రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంకొన్నాళ్ల తర్వాత ఆ రాజ కుటుంబానికి చెందిన వారసుల్లో ఇంకో వ్యక్తి కూడా ఆ భూమిని ఆక్రమించుకోవాలి అని కుట్రలు పన్నుతుంటాడు. ఇదే క్రమంలో హీరో బాబాయ్ కొడుకు కోలం ఆడుతూ ఉంటాడు. క్లైమాక్స్ లో కోలం ఆడే వ్యక్తిని తన స్వార్థం కోసం చంపేస్తాడు ఆ రాజు కుటుంబానికి చెందిన వంశీయుడు.

అలాగే అక్కడి జనాలను కూడా దారుణంగా కాల్చి చంపేస్తాడు. చివర్లో హీరో కూడా కోలం ఆడతాడు. అతను తన ప్రజలను.. వారికి సాయం చేసిన పోలీస్ ఆఫీసర్ కు అప్పగిస్తున్నట్లు సినిమాలో చూపించారు. అయితే కోలం ఆడే వ్యక్తిలో నిజంగా దేవుడు వస్తే.. ఆ రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి అనగా.. ఆ ఊరికి పెద్ద దిక్కు అని జనాలు నమ్ముతున్న వ్యక్తే దుర్మార్గుడు అని ఎందుకు ఆ ప్రజలకు చెప్పలేదు.

ముందుగానే తెలియజేస్తే ఆ ప్రజలు జాగ్రత్త పడతారు కదా.? అనేది నెటిజెన్ల అభిప్రాయం. కానీ ఈ లాజిక్ ను ఏ మాత్రం మేకర్స్ పట్టించుకోలేదు. ఇక ప్రేక్షకులు కూడా ఈ లాజిక్ ను పూర్తిగా పక్కన పెట్టేసి స్క్రీన్ ప్లే ని మాత్రమే ఎంజాయ్ చేశారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus