కోవిడ్ టైంలో ఓటీటీలే ఎంటర్టైన్మెంట్ కి పెద్ద దిక్కు అయ్యాయి. చాలా సినిమాలు ఓటీటీలను ఆశ్రయించడం.. థియేటర్ రిలీజ్..లు స్కిప్ చేసి ఓటీటీలకి రావడం జరిగింది. వ్యూయర్ షిప్ కూడా బాగా వస్తుండటంతో ఓటీటీ సంస్థలు భారీ రేట్లకి సినిమాలను కొనడం మొదలుపెట్టాయి. చిన్న సినిమాలకి కూడా మంచి రేట్లు ఆఫర్ చేశాయి. కానీ ఇప్పుడు ఓటీటీల హవా తగ్గింది. పెద్ద సినిమాలు అయితే తప్ప జనాలు చూడటం లేదు.
అందువల్ల చిన్న సినిమాలకి మాత్రమే కాదు.. మిడ్ రేంజ్ సినిమాలకి కూడా బిజినెస్ కాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. గతేడాది ఓ చిన్న సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. వీకెండ్ వరకు సందడి చేసింది,తర్వాత మాయమైపోయింది. సహజంగానే ఆ సినిమాకి ఓటీటీ బిజినెస్ అవ్వలేదు. ఆ సినిమా పేరు ‘రాజుగారి కోడిపులావ్’. బుల్లితెర ప్రభాకర్, సాయి సుధా .. కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఇది. శివ కోన ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. అయితే ఈ సినిమాని ఏ ఓటీటీ సంస్థ కొనుగోలు చేయలేదు.
దీంతో ‘ఎల్.సి.డి'(లవ్ సె*స్ ట్రూత్) గా పేరు మార్చేసి వెబ్ సిరీస్ గా దీనిని ఎం.ఎక్స్.ప్లేయర్ ఓటీటీ వారికి అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో సీక్రెట్ ఏంటి అంటే.. మొదట దీనిని వెబ్ సిరీస్ గానే మొదలుపెట్టారట. కానీ తర్వాత ఇందులో బెడ్ రూమ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో యూత్ కనెక్ట్ అవుతారు అని ప్లాన్ చేసి ‘రాజుగారి కోడిపులావ్’ (Rajugari Kodipulao)పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీనిని వెబ్ సిరీస్ గా మార్చి ఓటీటీలో రిలీజ్ చేస్తుండటం గమనార్హం.