Varun Tej Ghani: వరుణ్ తేజ్ ‘గని’.. హై వోల్టేజ్ ఎపిసోడ్స్

ముకుంద సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆ తరువాత కంచె తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ద్వారా పెద్ద సక్సెస్ కొట్టిన వరుణ్, అక్కడి నుండి మరింతగా అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఆపై వచ్చిన తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలు కూడా సూపర్ హిట్ కొట్టి హీరోగా వరుణ్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి.

ఇక ప్రస్తుతం యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ చేస్తున్న సినిమా గని. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా అల్లు బాబీ, సిద్దు ముద్ద ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, శాండల్ వుడ్ నటుడు ఉపేంద్ర ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని,

ఆ సీన్ తో సెకండ్ హాఫ్ పై ఆడియన్స్ లో మరింతగా ఎగ్జైట్మెంట్ పెరుగుతుందని, అలానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి బంప్స్ రావడం ఖయాం అని అంటున్నారు. మొత్తంగా గని సినిమా రేపు రిలీజ్ తరువాత అందరి నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుని సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరోవైపు ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్న వరుణ్ ఎంతో కష్టపడ్డట్లు తెలుస్తోంది. మరి త్వరలో విడుదల కానున్న గని మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus