మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా పూర్తి చేసిన వెంటనే.. ‘ఎన్టీఆర్ 30’ ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు..ఇది వరకే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అందుకోసం మిగిలిన భాషల్లో ప్రఖ్యాతి చెందిన స్టార్ టెక్నీషియన్లను ఎంపిక చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్ పేరు పరిశీలనలో ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి విభాగాలకు కూడా స్టార్ టెక్నీషియన్లను తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం లేడీ అమితాబ్ విజయశాంతిని సంప్రదించాడు దర్శకుడు కొరటాల శివ. అయితే ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. ఎన్టీఆర్ కు కూడా విజయశాంతి వంటి స్టార్ నటితో కలిసి నటించాలని ఆశపడ్డాడు. ఈ నేపథ్యంలో కొరటాల శివ చాలా సార్లు ఆమెను సంప్రదించి కన్విన్స్ చేయడానికి ట్రై చేసాడట కానీ ఆమె సముఖత చూపలేదని సమాచారం. దీంతో ఇప్పుడు రమ్యకృష్ణ ను ఆ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది.
అయితే ఈ పాత్ర చేయడానికి రమ్యకృష్ణ ఓకే చెప్పినా.. ఇలాంటి పాత్రనే ఆమె ‘రిపబ్లిక్’ సినిమాలో కూడా చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివకి తెలియజేసింది. దీంతో ఈమె పాత్రలో మార్పులు చేయాలా లేక రమ్యకృష్ణను పక్కన పెట్టి.. వేరే సీనియర్ నటిని తీసుకోవాలా అనే డైలమాలో కొరటాల అండ్ టీం పడినట్లు తెలుస్తుంది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?