ఒంటరితనం… మనిషిని ఒక చోట ఉండనివ్వదు. జీవితంలో ఏదో కోల్పోయామనో, లేక నాకు ఎవరూ లేరనో ఫీలింగో, ఇలా ఏదో ఒక కారణం మనిషిని మానసికంగా తినేస్తుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు మానసికంగా కుంగిపోయి జీవచ్ఛవం అయితే, ఇంకొందరు ప్రాణం వదిలేస్తుంటారు. తాజాగా అలా ఓ పోర్న్ స్టార్ చనిపోయింది అంటున్నారు. ఆమె పేరు క్రిస్టినా లిసీనా. రష్యాకు చెందిన ఈ పోర్న్ స్టార్‌ను క్రిస్ ది ఫాక్స్‌గా పిలుచుకుంటారు.
రష్యాలోని నెవెస్కీ జిల్లాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఉన్న ఓ పెద్ద భవంతి దగ్గర ఇటీవల ఓ మృతదేహం కనిపించింది. ఎవరు, ఏంటి అని ఆరా తీస్తే… ఆమె దగ్గర ఉన్న ఓ కార్డు ఆధారంగా క్రిస్టినా లిసినా అని తేలింది. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు… ఆమె 22వ అంతస్తు నుండి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారట. చనిపోయిన సమయంలో ఆయమె చేతిలో ‘యువార్ ఆల్వేజ్ ఇన్ మై హార్ట్’ అనే కాయిన్ ఉందట. దీంతో ప్రేమికుణ్ని తలచుకుంటూ మరణించి ఉండొచ్చు అని పోలీసులు ప్రాథమికంగా అనుకుంటున్నారట.
అయితే క్రిస్టినా గత కొంత కాలంగా ఒంటరితనంతో బాధపడుతోందని, తరచూ తనకు కుటుంబం, కుటుంబ సభ్యుల ప్రేమ ఉంటే బాగుండు అని అనేదని ఆమె సన్నిహితులు స్థానిక మీడియాతో చెబుతున్నారు. మరోవైపు ఆమె బాయ్ ఫ్రెండ్ రుస్తమ్ అయితే ఆమె అంత్యక్రియలకు సాయం చేయండి అంటూ సోషల్ మీడయా వేదికగా పిలుపునిచ్చాడు. లిసినా సంగతి చూసుకుంటే… ఆమెకు సైబీరియాకు చెందిన వ్యక్తి. రష్యాలో ఓ ఫ్లాట్ కొనుక్కొని గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటోందట. గతంలో బ్యాంకులో ఉద్యోగం చేసిన ఆమె… కొన్ని రోజులకు మానేసి… పోర్న్ వృత్తిలోకి దిగింది.