తెలుగు వారి సోగ్గాడు.. శోభన్‌బాబు. ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అన్నగారు ఎన్టీఆర్ ను రాముడు, కృష్ణుడుగా భావించిన రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావును లవర్‌బోయ్‌గా ప్రేక్షకులు ఆదరించారు. దేవదా సు పాత్ర ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఇదే. ఇక, హీరో కృష్ణ విషయానికి వస్తే..ఆయనను కౌబోయ్‌గా పిలిచేవారు. ఎన్ని సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు వేసినా.. కృష్ణను కౌబోయ్‌గానే కీర్తించేవారు. ఇక, శోభన్‌బాబు విషయానికి వస్తే.. సోగ్గాడు.. అని పిలుచుకునేవారు.
నిజానికి శోభన్‌బాబు (Sobhan Babu) అనేక పౌరాణిక సినిమాల్లో నటించారు. అనేక సాంఘిక సినిమాల్లోనూ రాణించారు. జానపద చిత్రాల్లోనూ శోభన్‌బాబు నటించారు. అయితే.. సాంఘిక సినిమాల్లోనూ.. ముఖ్యంగా కుటుంబ కథలు, పెళ్లిళ్ల వంటి సినిమాల్లోనూ శోభన్‌బాబుకు ఎనలేని పేరు వచ్చింది. ఇదిలావుంటే.. శోభన్‌బాబు తొలినాళ్లకు.. తర్వాత కు చాలా వ్యత్యాసం ఉంటుంది. శోభన్‌బాబుతో దర్శకరత్న దాసరి నారాయణరావు పరిచయం అయ్యాక..
ఆయన హెయిర్ స్టయిల్‌పై దృ ష్టి పెట్టారు. దీనికి కారణం.. అప్పటికి హీరోగా ఉన్న కృష్ణ హెయిర్ స్టయిల్.. శోభన్‌బాబు హెయిర్ స్టయిల్ కూడా ఒకేరకంగా ఉండడంతో దాసరి.. శోభన్‌బాబు హెయిర్ స్టయిల్‌ను మార్చాలని నిర్ణయించారు. కానీ, కుదిరే పనికాదు! ఏం చేయాలి. దీనికి శోభన్‌బాబు కూడా అంగీకరించలేదు. దీంతో ఎట్టకేలకు.. నుదురుపై వంకీగా జుట్టు కొసలు లాగి..
ఇదే నీస్టయిల్! అని చెప్పారు దర్శరత్న. అయితే.. ముందు దీనికి కూడా ఒప్పుకోని శోభన్ బాబు తర్వాత.. ఈ స్టయిల్ హెయిర్‌డ్రస్‌తో నటించిన సినిమా హిట్ కావడంతో అప్పటి నుంచి దీనిని కొనసాగించారు. అప్పటిలో ప్రతి అబ్బాయి శోభన్ బాబు హెయిల్ స్టయిల్ ను ఫాలో అవే వారు. ఇప్పటికి కొన్ని సినిమాల్లో శోభన్ బాబు స్టయిల్ ను కొనసాగిస్తున్నారు.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు