దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘చిత్రం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో కెమెరామెన్ గా పనిచేసిన తేజ.. దర్శకుడిగా మారాడు. ‘ఉషాకిరణ్ మూవీస్’ బ్యానర్ పై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 2000 వ సంవత్సరం జూన్ 16న ఈ చిత్రం విడుదలైంది. మొదట ఈ చిత్రాన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మొదటి రోజు మొదటి షోకి ఈ మూవీ కేవలం 11 థియేటర్లలో మాత్రమే వేశారట.
కానీ ఈవెనింగ్ షోల నుండి స్క్రీన్స్ పెరుగుతూ వచ్చాయి. ఇక తర్వాత (Chitram) ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. చిన్న సినిమాల్లో కనీ వినీ ఎరుగని కలెక్షన్స్ ను ఈ మూవీ సాధించింది. రూ.42 లక్షల బడ్జెట్ లో ఈ మూవీని తెరకెక్కించాడు తేజ. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.9 కోట్ల లాభాలను అందించింది. అయితే ఈ చిత్రానికి ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదు.
అతన్ని మొదట ఫ్రెండ్ క్యారెక్టర్ కు తీసుకున్నారు. కానీ ముందుగా అనుకున్న హీరో.. సరిగ్గా చేయలేకపోవడంతో ఉదయ్ కిరణ్ ను రీప్లేస్ చేశాడు తేజ. అయితే ఈ చిత్రాన్ని మరో స్టార్ హీరో మిస్ చేసుకున్నాడట. అతను మరెవరో కాదు తరుణ్. అప్పటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తరుణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు తేజకి.. తరుణ్ ను రిఫర్ చేశారట రామోజీరావు గారు. అయితే ఈ సినిమాలో మా హీరోకి రూ.11 వేలు మాత్రమే పారితోషికం అని చెప్పడంతో తరుణ్ తల్లి రోజా రమణి..
‘ఏంటి మా అబ్బాయి విలువ రూ.11 వేలా?’ అంటూ షాకైందట. అందుకు తేజ ‘మీ అబ్బాయి విలువ కాదండీ.. మా సినిమాలో హీరోకి మేము అనుకున్న రెమ్యూనరేషన్ అది… మీ అబ్బాయికి ఎవ్వరూ విలువ కట్టలేరు’ అంటూ చెప్పాడట తేజ. తర్వాత ఆమె నో చెప్పడం.. తేజ ఉదయ్ కిరణ్ తో ఆ మూవీ కంప్లీట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగింది.