Star Hero: 23 సర్జరీలు చేయించి తన కాళ్ళను తిరిగి రప్పించుకున్న స్టార్ హీరో

ఈ ఫోటో లో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా ..?, ఇతని తండ్రి కి సినిమాలు అంటే పిచ్చి ఆ మక్కువతోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. కానీ అతని కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయన నటన లో నేటి తరం కమల్ హాసన్ అని అనిపించుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈయన ప్రస్తుతం సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు.

ఈయన సినిమాలు తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యినవి ఉన్నాయి. వాస్తవానికి ఇతని వెండితెర అరంగేట్రం తెలుగు సినిమాతోనే అయ్యింది. కానీ ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అక్కడే శాశ్వతంగా స్థిరపడ్డాడు, స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. అతను మరెవరో కాదు చియాన్ విక్రమ్. ఈ ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్నది ఆయనే. విక్రమ్ తండ్రి పేరు వినోద్ రాజ్, ఈయన కూడా పలు సినిమాల్లో నటించాడు, ఈ విషయం చాలా మందికి తెలియదు.

కొడుకు లో నటుడు అవ్వాలనే ఉత్సాహం ని గమనించిన వినోద్ రాజ్, చిన్నతనం నుండి (Star Hero) విక్రమ్ ని బాగా ప్రోత్సహించేవాడు. అలా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరిన విక్రమ్ , ఒకరోజు ఆడిషన్స్ కోసం వెళ్తుండగా ఒక ట్రక్ ఆయనని గుద్దేసింది. దీంతో విక్రమ్ రెండు కాళ్ళు విరిగిపోయాయి. విరిగిన ఆ రెండు కాళ్ళు తీస్తే కానీ విక్రమ్ ప్రాణాలతో ఉండదు అని అప్పట్లో డాక్టర్స్ తేల్చి చెప్పారట. కానీ విక్రమ్ మాత్రం తాను హీరో అవ్వాలని అనుకున్న కలలు అన్ని ఆవిరి అయిపోతాయని,

దయచేసి నా కాళ్లకు ఆపరేషన్ చేయించండి అని బ్రతిమిలాడి, పెద్ద పెద్ద సర్జన్స్ ని పిలిపించి 23 సర్జరీలు చేయించి తన కాళ్ళను తిరిగి రప్పించుకున్నాడు. అలాంటి విక్రమ్ నేడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఎన్నో సంచలనాత్మకమైన పాత్రలను పోషించి హిట్స్, బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని సౌత్ లోనే టాప్ స్టార్ గా ఎదిగాడు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus